తూ..తూ.. పదేళ్లుగా ఒకే డ్రాయర్ వాడుతున్న ప్రముఖ హీరో .. ఇదేం పిచ్చి రా నీకు .

తూ..తూ.. పదేళ్లుగా ఒకే డ్రాయర్ వాడుతున్న ప్రముఖ హీరో .. ఇదేం పిచ్చి రా నీకు .

జనం న్యూస్: మనిషన్న తర్వాత సెంటిమెంట్లు ఉండటం సహజం. అయితే, కొంతమందికి సెంటిమెంట్లు తారా స్థాయిలో ఉంటాయి. ఆ సెంటిమెంట్ల కారణంగా వారు ఇబ్బంది పడటమే కాకుండా.. ఇతరులను ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఇంకా కొంతమంది సెంటిమెంటు పిచ్చిగా మారుతుంది. ఈ రకం వాళ్లు దేన్నేనా సెంటిమెంటుగా అనుకుంటే ఓ పట్టాన వదిలిపెట్టరు. ఆఖరికి వేసుకునే బట్టల విషయంలో కూడా చాలా నిక్కచ్చిగా ఉంటారు. అందులో సాధారణ ‍ప్రజలు.. సెలెబ్రిటీలు అన్న తేడా లేదు. సెంటిమెంట్ల విషయానికి వచ్చేసరికి అందరూ మామూలు మనుషులు అయిపోతారు. ప్రముఖ జపనీస్‌ నటుడు యూకీ కాజీ కూడా అంతే.. ఆయన ఓ డ్రాయన్‌ను సెంటిమెంట్‌గా భావించారు. దాదాపు పదేళ్ల పాటు దాన్ని వేసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తన సోషల్‌ మీడియా ఖాతాలో షేర్‌ చేశారు. యూకీ కాజీ తన పోస్టులో..‘‘ నేను అటాక్‌ ఆన్‌ టైటాన్స్‌కు ఓ పాత్ర చేస్తూ ఉన్నాను. కొన్ని కారణాల వల్ల ఒకే డ్రాయర్‌ వేసుకోవాల్సి వచ్చేది. అది కేవలం యాధృచ్చికమని నేను అనుకుంటున్నాను. 

నేను మొదటి ఎపిసోడ్‌ రికార్డు చేస్తున్నపుడు బ్లాక్‌ అండ్‌ వైట్‌ డ్రాయర్‌ వేసుకున్నాను. అది నా పనిని తెలిపే విధంగా ఉంటుందని అనుకున్నాను.రెండవ ఎపిసోడ్‌కు కూడా అదే డ్రాయర్‌ వేసుకున్నాను. అప్పుడు నాకు అనిపించింది. ‘అయ్యో.. గత వారమే కదా దాన్ని వేసుకున్నాను’అని. అప్పుడు నిశ్చయించుకున్నాము. దాన్నే ప్రతి ఎపిసోడ్‌కు ధరించాలని. అలా పదేళ్ల నుంచి వాడుతున్నాను. ఇప్పుడు ఒక ఎపిసోడ్‌ మాత్రమే ఉంది. త్వరలోరిటైర్‌ అయిపోతా’’ అని చెప్పాడు.