అంజన్న నామస్మరణతో మార్మోగిన చాకరిమెట్ల దేవాలయం

అంజన్న నామస్మరణతో మార్మోగిన చాకరిమెట్ల దేవాలయం

చాకరిమెట్లలో స్వామివారికి భక్తుల కార్తీక పూజలు..

ఆలయ ఫౌండర్ చైర్మన్ భాస్కరరాయని ఆంజనేయశర్మ ఆధ్వర్యంలో భక్తుల సామూహిక సత్యనారాయణ వ్రతాలు...

 జనం న్యూస్ నవంబర్23.24 శివంపేట మండలం మెదక్ జిల్లా కెసత్యనారాయణ గౌడ్ 

జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శివ్వంపేట మండలంలోని చిన్నగొట్టిముక్కుల శివారులో వెలసిన చాకరిమెట్ల సహకార ఆంజనేయ స్వామి దేవాలయ పరిసరాలన్ని కార్తీక మాసం పురస్కరించుకొని శనివారం అంజన్న నామస్మరణతో మార్మోగిపోయాయి. చాకరిమెట్ల 
 సహకార ఆంజనేయస్వామి స్వయంభూ క్షేత్రానికి కార్తీక మాసం సందర్బంగా ఉమ్మడి మెదక్ జిల్లాలతో పాటుగా జంట నగరాలు, వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన స్వామివారి భక్తులు దేవాలయంలో స్వామివారికీ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా భక్తులు ఆంజనేయస్వామికీ అభిషేకం, అర్చన, మన్యాసుక్త పారాయణం, బిల్వ దళర్చన, ఆకుపూజా, పంచామృతాలతో అభిషేకాలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనం, పూజల అనంతరం అర్చకులు భక్తులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయ ప్రాంగణంలోని సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో ఆలయ పౌండర్ చైర్మన్ భాస్కరరాయని ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో భక్తులు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను ఆచరించి, స్వామివారి మొక్కులు చెల్లించుకున్నారు. ఈకార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు శాస్త్రుల దేవదత్తు శర్మ, అర్చకులు శ్రీవత్సవ శర్మ, శ్రీహర్షశర్మ, చరణ్ శర్మ, దేవిశ్రీ ప్రసాద్ శర్మ, ప్రభురాజశర్మలతో పాటు  భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.