అప్పు కట్టలేదని భర్త ముందే భార్యను పాడు చేసి.. ఆపై వీడియోలు తీసి.. చీ..చీ.. చంపేయాలి వాడిని.

అప్పు కట్టలేదని భర్త ముందే భార్యను పాడు చేసి.. ఆపై వీడియోలు తీసి.. చీ..చీ.. చంపేయాలి వాడిని.

జనం న్యూస్: రోజురోజుకు పెరుగుతున్న నిత్యావసరాల ధరల కారణంగా సామాన్యులు బతకడం చాలా బరువవుతోంది. ఎంత సంపాదించినా సామాన్య కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉంటాయి. ఇంట్లో అవసరాల కోసం అప్పుడప్పుడు అప్పులు కూడా చేయాల్సి వస్తుంది. అయితే డబ్బులు ఇచ్చిన వారికి సమయానికి డబ్బులు ఇస్తే సరే లేకపోతే నానా హంగామా చేస్తారు. బయట అప్పు తీసుకుంటే వడ్డీ వ్యాపారస్తులు తమ డబ్బులు ఇవ్వనందుకు వేరే వస్తువులను తీసుకెళ్తారు. లేదంటే ఇంటిపైకి వచ్చి గొడవలకు దిగుతారు. అలాంటిదే తాజాగా పూణెలో షాకింగ్ న్యూస్ వినాల్సి వచ్చింది. అప్పు తీర్చలేదని ఓ మహిళను అత్యాచారం చేశాడు ఓ దుర్మార్గుడు. అంతటితో ఆగకుండా వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. పూణె హడప్సర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ భార్యాభర్తలు ఇద్దరు ఇంతయాజ్ హెచ్.షేక్ నుండి రూ. 40 వేలు అప్పుగా తీసుకున్నారు. కానీ వారి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వారు తిరిగి అప్పు చెల్లించలేకపోయారు. ఫిబ్రవరిలో ఇంతియాజ్ డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశాడు. వారి వద్ద డబ్బులు లేవని చెప్పడంతో షేక్ కత్తి తీసి చంపుతానని బెదిరించాడు. ఈ క్రమంలో అప్పుతీసుకున్న వ్యక్తి భార్య అడ్డు వచ్చింది. తన భర్తపై కత్తితో దాడికి పాల్పడిన షేక్ ను బతిమాలుకుంది. అయినా వినకుండా వడ్డీ వ్యాపారి షేక్ భర్త కళ్లెదుటే భార్యపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణాన్ని తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. మహిళను తనతో లైంగికంగా సంబంధం పెట్టుకోమని వేధించాడు. దానికి ఆమె సహకరించలేదు. వడ్డీ వ్యాపారి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు నిందితుని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేశారు. దీనిపై పోలీస్ ఇన్‌స్పెక్టర్ రవీంద్ర షెలాకే మాట్లాడుతూ.. ‘మేము నిందితుడిని కనుగొనిఅరెస్ట్ చేసాము. అతన్ని కోర్టులో హాజరుపరిచాము, అతన్ని గురువారం వరకు రిమాండ్‌కు పంపించారు’ అని తెలిపారు.