అల్లుడితో లాడ్జ్ కి వెళ్ళిన అత్త.. తెల్లారేసరికి శవం అయ్యి కనిపించింది.. అసలేమయ్యింది..?

అల్లుడితో లాడ్జ్ కి వెళ్ళిన అత్త.. తెల్లారేసరికి శవం అయ్యి కనిపించింది.. అసలేమయ్యింది..?

జనం న్యూస్: రాను రాను సంబంధ బాంధవ్యాలు మంట కలిసి పోతున్నాయి. వరసలు మరిచి కిరాతకంగా వ్యవహరిస్తున్నారు. వివాహేతర సంబంధాలతో విహరిస్తున్నారు. చివరికి అనేక ఇబ్బందులు పడి కేసుల పాలవుతున్నారు కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. తాజాగా అలాంటి ఘటనే వెలుగు చూసింది. మెడికల్ చెకప్ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్తానని చెప్పి ఒక మహిళ తన అల్లుడితో కలిసి లాడ్జికి వెళ్ళింది. రాత్రంతా అక్కడే గడిపింది. తీరా ఉదయాన్నేచూసేసరికి విగత జీవిగా పడి ఉంది.. పూర్తి వివరాలు చూద్దాం.. హైదరాబాద్ రావూరి అరుణ (35) తన భర్త కృష్ణారావుతో కలిసి కోళ్ల ఫామ్ లో కూలి పనులు చేసుకునేవారు. ఈనెల 14వ తేదీన అరుణ తన కడుపులో నొప్పి వస్తుందని చెప్పి తన సొంత గ్రామమైన తిరువూరులో వైద్యం చేయించుకుని వస్తానని చెప్పింది. హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఆమె తన సొంత ఊరుకి వెళ్లలేదు. కృష్ణారావు మేనల్లుడు అయిన ఆంజనేయులుతో కలిసి భద్రాచలం వెళ్ళింది. ఇద్దరు కలిసి అక్కడి లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నారు. రోజంతా అక్కడే గడిపారు. ఈ విషయం కాస్త కృష్ణారావుకు తెలిసింది. భయంతో అరుణ లాడ్జిలోనే ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆ* *త్య చేసుకుంది. ఈ విషయం తెలిసిన వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అరుణ మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు,కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.