ఆయిల్ పామ్ పంట సాగు పై అవగాహన కల్పించిన

వ్యవసాయ అధికారి లావణ్య
జనం న్యూస్ మల్లాపూర్ మండలం లోని మొగిలిపేట గ్రామంలో ఆయిల్ పామ్ పంట సాగు పై అవగాహన కల్పించడం జరిగింది . వ్యవసాయ అధికారి లావణ్య మాట్లాడుతూ ఆయిల్ పామ్ సాగు చేయడానికి ఆసక్తి ఉన్న రైతులు క్రింద తెలిపిన డాక్యుమెంట్లు జిరాక్స్ కాపీలను మరియు డిడి ఇచ్చి దరఖాస్తు చేసుకోవలెను.
1. ఆధార్ కార్డు జీరాక్స్
2. బ్యాంకు పాస్ పుస్తకం జిరాక్స్
3. పట్టాదారు పాసు పుస్తకం జిరాక్స్ కాపీ లేదా 1-బి కాపీ జిరాక్స్
4 . పాస్ సైజు ఫోటో-2
డిడి తీయవలసిన చిరునామా:
District Horticulture and Sericulture officer jagtiyal
ఆయిల్ పామ్ సాగు కు అందించు రాయితిలు:
ఒక మొక్క ఖరీదు 193 రూపాయలు దానిలో రైతు చెల్లించవలసినది 20 రూ॥లు మాత్రమే. మిగిలినది ప్రభుత్వం రాయితి అందిస్తుంది.ఎకరానికి 57 మొక్కలు.3 సంవత్సరాల వరకు ఆయిల్ పామ్ సాగు మరియు అంతర పంటల సాగు నిర్వహణ ఖర్చు ఇవ్వబడును.( ఆయిల్ పామ్ సాగుకు రూ. 2100 ఎకరాకు మరియు అంతర పంట సాగుకు రూ.2100 ఎకరాకు.మొత్తం ఎకరానికి 4200 రూ||లు సంవత్సరానికి ప్రభుత్వం నేరుగా రైతు ఖాతాలో వేస్తుంది)
రెండవ సంవత్సరం పైన తెలిపినవిధంగా ఎకరానికి ₹4200 ఇస్తుంది
మూడవ సంవత్సరం : పైన తెలిపిన విధంగా ఎకరానికి ₹4200 ఇస్తుంది.నాల్గవ సంవత్సరం : పైన తెలిపిన విధంగా ఎకరానికి ₹ 4200 ఇస్తుంది.•డ్రిప్ సేద్యం ద్వారా నీరు అందించుటకు 80% నుండి 100% వరకు రైతు కేటగిరిననుసరించి రాయితీ యివ్వబడును.తోట నాటిన 3 సంవత్సరాల తర్వాత దిగుబడి ప్రారంభమై 35 సంవత్సరాల వరకు కొనసాగును. మొదటి 3 సంవత్సరాల వరకు అన్ని రకాల కూరగాయలు, వేరుశనగ, సొయా, ప్రత్తి, పెసర, మినుములు, శనగ, కుసుమ, పసుపు, జొన్నలు, మక్కలు, సజ్జ, ఎర్ర జొన్నలు మొదలగు మెట్ట పంటలను అంతరపంటలుగా వేసుకోవచ్చు. వరి మరియు చెరుకు పంటను అంతర పంటలుగా సాగు చేయరాదు
నాలుగు సంవత్సరాల తర్వాత కూడా దుక్కి దున్నకుండా అంతర పంటలుగా కోకో, మిరియాలు, జనిజాపత్రి సాగు చేయవచ్చు అని చెప్పారు ఈ కార్యక్రమంలో మొగిలిపేట రైతులు పాల్గొన్నారు.