ఆర్ఎంపీ డాక్టర్ భార్య మృతి

ఆర్ఎంపీ డాక్టర్ భార్య మృతి

జనం న్యూస్ మార్చి 17 హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో ఆర్ఎంపి డాక్టర్ రాచర్ల ప్రభాకర్ భార్య మామిడి సంధ్యారాణి ప్రమాదవశాత్తు ట్రైన్ కింద పడి మృతి చెందింది శుభకార్యానికి వెళుతూ పుష్పుల్ ట్రైన్ నుండి జారీ క్రింద పడిపోయింది ఈ సంఘటన చెర్లపల్లి రైల్వే స్టేషన్ లో దిగుతుండగా ప్రమాదం జరిగింది ఆర్ఎంపీ డాక్టర్ రాచర్ల ప్రభాకర్ అతని భార్య సంధ్యను కాపాడపోయి అతనికి తీవ్ర గాయాలు అయినాయి అతని చికిత్స నిమిత్తం శ్రీకర్ హాస్పిటల్ కు తరలించారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం శాయంపేట కు చెందిన ఆర్ఎంపి వైద్యుడు రాచర్ల ప్రభాకర్ తన కుటుంబ సభ్యులతో కలిసి వివాహ శుభకార్యానికి హాజరయ్యేందుకు పుష్పుల్ ట్రైన్ లో హైదరాబాదుకు బయలుదేరారు చర్లపల్లి వద్ద ఒకరి తరువాత ఒకరు ట్రైన్ దిగుతుండగా సంధ్య ట్రైన్ నుండి దిగపోతున్న సమయంలో ఒకసారి గా ట్రైను కదలడంలో ట్రైన్ కింద పడి ఆమె వెనుకనే ఉన్న భర్త ప్రభాకర్ రక్షించబోయి తాను కూడా కిందపడ్డాడు అతని భార్య అక్కడికక్కడే మరణించగా ప్రభాకర్ కు కాల్ ప్యాక్చర్ అయింది ఈ విషయం తెలుసుకున్న రైల్వే సిబ్బంది అక్కడే ఉన్న ప్రయాణికుల సహకారంతో ప్రభాకర్ ను రక్షించి ఈసీఐఎల్ ప్రాంతంలోని శ్రీ కార్ హాస్పిటల్ కు చికిత్స నిమిత్తం తరలించారు శుభకార్యానికి హాజరయ్యేందుకు వెళుతూ సంధ్య అనంత లోకానికి వెళ్లిపోయిందని కుటుంబ సభ్యుల అర్థ నాదాలు శాయంపేట గ్రామీణ వైద్యుడిగా మంచి పేరున్న ప్రభాకర్ రైలు ప్రమాదంలో అతని భార్య సంధ్య మరణించిందని అదే ప్రమాదంలో ప్రభాకర్ కాలు ఫ్రాక్చర్ అయిందన్న సమాచారం తెలియడంతో గ్రామంలో విషాద భయాలు అలుముకున్నాయి.