ఆసుపత్రి పాలైన టీవీ నటి రోహిణి.. పరిస్థితి విషమం అసలు ఎం జరిగింది..?

ఆసుపత్రి పాలైన టీవీ నటి రోహిణి.. పరిస్థితి విషమం అసలు ఎం జరిగింది..?

జనం న్యూస్: టివి ప్రేక్షకులకు నటి రోహిణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం బిజీ గా ఉన్న నటులలో రోహిణి కూడా ఒకరు.ఒకపక్క జబర్దస్త్ వంటి కామెడీ షో లు చేస్తూనే మరో పక్క సినిమాలు మరియు వెబ్ సిరీస్ లతో క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతుంది నటి రోహిణి. రోహిణి కామెడీ టైమింగ్స్ వేరే లెవెల్ అని చెప్పచ్చు. తాను మాట్లాడే విధానం కూడా డిఫరెంట్ గా ఉంది అందరికి నవ్వు తెప్పించేలా ఉంటుంది.ఇటీవలే ఆమె ఆసుపత్రి పాలవ్వడంతో ఆమె ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదని తెలుస్తుంది. రోహిణి కాలు సర్జరీ కోసం తానె స్వయంగా ఆసుపత్రికి వెళ్లినట్టు సమాచారం.డాక్టర్లు సర్జరీ చేయడం కుదరదని చెప్పినట్లు రోహిణి తన యూట్యూబ్ ఛానల్ వేదికగా వివరాలు తెలిపింది. 5 ఏళ్ళ క్రితం ఒక యాక్సిడెంట్ తర్వాత తన కాలులో రాడ్ వేసినట్లు రోహిణి చెప్పుకొచ్చింది. వరుస షూటింగ్ కారణంగా దానిని ఎప్పుడు తీయించాలని అనుకున్న కుదర లేదని రోహిణి తెలిపింది. ఇప్పుడు కొంచెం ఫ్రీ టైం దొరకడంతో రాడ్ తీయించుకొని రెస్ట్ తీసుకోవాలని అనుకున్న తనకు నిరాశే ఎదురైంది. ఆలస్యం చేయడం కారణంగా రాడ్ ఆమె స్కిన్ కు అటాచ్ అయిపోయిందని డాక్టర్లు తెలిపినట్లు రోహిణి చెప్పుకొచ్చింది. రాడ్ తొలగించకుండా డాక్టర్లు ఆమె కాలికి మైనర్ సర్జరీ చేయడంతో ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలోనే రెస్ట్ లో ఉంది.తనకు సపర్యలు చేస్తున్న తల్లి ని చూసి ఎమోషనల్ అయినా రోహిణి హ్యాపీ మదర్స్ డే అమ్మ ఐ లవ్ యు లవ్ యు సో మచ్ నువ్వు లేకుండా నేను ఏమి కాదు..నువ్వే నా సర్వస్వము..ని కోసం ఏమైనా చేస్తాను..కాప్షన్ తో ఇంస్టా లో వీడియోను షేర్ చేసింది రోహిణి.