ఇంటింట ప్రచారం నిర్వహించిన నందికొండ మున్సిపల్ చైర్మన్ కర్ణ అనుష శరత్ రెడ్డి

ఇంటింట ప్రచారం నిర్వహించిన నందికొండ మున్సిపల్ చైర్మన్ కర్ణ అనుష శరత్ రెడ్డి

 జనం న్యూస్ నాగార్జునసాగర్ ప్రతినిధి నవంబర్ 20 నందికొండ మున్సిపాలిటీలో ఇంటింట ప్రచారం నిర్వహించిన మున్సిపల్ చైర్మన్ కర్ణ అనూష శరత్ రెడ్డి బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కర్ణ బ్రహ్మానందరెడ్డిసోమవారం మున్సిపాలిటీలో బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరించిన నందికొండ మున్సిపల్ చైర్మన్ కర్ణ అనుష శరత్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాతు నాగార్జునసాగర్ ని మున్సిపాలిటీగా చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దివంగత మాజీ ఎమ్మెల్యే నరసింహయ్య చొరవతోనే నందికొండ మున్సిపాలిటీగా అవతరించందని తెలిపారు మున్సిపాలిటీలో సీసీ రోడ్లు ఆధునిక బస్టాండ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్లు మల్టీ షాపింగ్ మాల్ అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఘనత బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల భగత్ కే సాధ్యమని అన్నారు ఈఎన్నికల్లో నాగార్జునసాగర్ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల భగత్ ను అత్యధిక మెజార్టీతో ప్రజలు ఆశీర్వదించాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో నందికొండ మున్సిపాలిటీ ముఖ్య సలహాదారుడు కర్ణ శరత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు