ఈ ఫొటోలో ఉన్నవాళ్ళలో ఒక అమ్మాయి ఇప్పుడు చాలా పెద్ద హీరోయిన్.. ఎవరో కనుక్కోండి చూద్దాం.

ఈ ఫొటోలో ఉన్నవాళ్ళలో ఒక అమ్మాయి ఇప్పుడు చాలా పెద్ద హీరోయిన్.. ఎవరో కనుక్కోండి చూద్దాం.

జనం న్యూస్: తెలుగు సినీ పరిశ్రమకు ఎంతో మంది హీరోయిన్లు తమ అందంతో, అభినయంతో వన్నెను అద్దారు. తెలుగు నటీమణులే కాకుండా ఇటు హిందీ భామలు, అటు మలయాళ కుట్టీలు పరిశ్రమకు వచ్చి.. తమను తాము నిరూపించుకుంటూనే.. టాలీవుడ్ గురించి మరో పరిశ్రమకు వెళ్లినప్పుడు నాలుగు మంచి మాటలు చెప్పారు. తెలుగు పరిశ్రమ ఆదరించిన తీరకు పొంగిపొర్లిపోయారు తెలుగు సినీ పరిశ్రమకు ఎంతో మంది హీరోయిన్లు తమ అందంతో, అభినయంతో వన్నెను అద్దారు. తెలుగు నటీమణులే కాకుండా ఇటు హిందీ భామలు, అటు మలయాళ కుట్టీలు పరిశ్రమకు వచ్చి.. తమను తాము నిరూపించుకుంటూనే.. టాలీవుడ్ గురించి మరో పరిశ్రమకు వెళ్లినప్పుడు నాలుగు మంచి మాటలు చెప్పారు. తెలుగు పరిశ్రమ ఆదరించిన తీరకు పొంగిపొర్లిపోయారు.

కొంత మంది హీరోయిన్స్ అయితే తెలుగు సినిమాలపై ప్రాక్టీసులు చేసి.. ఆ తర్వాత బాలీవుడ్, మాలీవుడ్‌లో టాప్ స్థానాలకు చేరుకున్నవారు ఉన్నారు. అటువంటి నటీమణుల్లో ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నది కూడా ఒకరు.  పొడువు, అందం, అభినయం ఉన్న నటీమణుల జాబితాను తీస్తే ఫింగర్ టిప్స్‌పై లెక్క పెట్టవచ్చు. ఆ నటీమణుల్లో ఒకరు.. ప్రస్తుతం ఈ ఫోటోలో ఉన్నారు. ఆమె ఎవరో గుర్తించండీ. క్లూ కూడా ఇస్తామండీ.. పై లైనులో మిడిల్ అమ్మాయి ఒకప్పుడు సినిమా పరిశ్రమలో టాప్ హీరోయిన్‌గా కొనసాగింది. బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ అగ్ర హీరోలతో ఆడిపాడింది. ఇంతకు ఆ పాపను గుర్తుపట్టారా.. ఎవరో కాదండీ మన శిల్పా శెట్టి. ఈ రోజు ఆమె పుట్టిన రోజు. కన్నడ సీమలో పుట్టిన ఈ పొడుగు కాళ్ల సుందరి.. తొలి సినిమాతోనే పాపులారిటీని తెచ్చుకుంది. నటుడు షారూఖాన్ బాజీఘర్‌ సినిమాతో హిందీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. వరుస సినిమాలు చేస్తూ స్టార్ స్టేటస్ పొందింది. ఆ సమయంలోనే తెలుగులోకి అడుగుపెట్టింది. దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన సాహస వీరుడు-సాగరకన్యలో టైటిల్ రోల్ పోషించింది. ఆ సినిమాతో ఆమెకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగింది. ఆ తర్వాత మోహన్ బాబుతో వీడెవండీ బాబూ, నాగార్జునతో ఆజాద్ సినిమాలో అమాయకురాలైన పల్లెటూరి అమ్మాయి పాత్రలో మెప్పించింది. బాలకృష్ణతో కలిసి భలేవాడివి బాసూ చిత్రంలో కనిపించింది. ఎక్కువగా హిందీ సినిమాల్లో కనిపించిన ఈ అమ్మడు.. అడపా దడపా కన్నడ చిత్రాలతో మెప్పించింది. తెలుగులో కనిపించలేదు. 2009లో ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు. ఈ పుట్టిన రోజుతో 48వ పడిలోకి అడుగుపెడుతున్నప్పటికీ.. ఏమాత్రం తరగని అందం ఆమె సొంతం. ఈ పుట్టిన రోజు ఆమె లండన్‌లో జరుపుకుంటున్నారు. ఆము పుట్టిన రోజు సందర్భంగా ప్రముఖ నటీనటులంతా ఆమెకు విషెస్ తెలిపారు.