ఈ బామ్మ చేసిన పనికి షేక్ అయిపోతున్న సోషల్ మీడియా.. ఎం చేసిందో మీరే ఈ (వీడియో చూడండి)

జనం న్యూస్: దేశంలో కృష్ణుడి జన్మదినం సందర్భంగా చాల చోట్లా ఉట్టికొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. కరోనా కారణంగా నాలుగేళ్లుగా ఈ వేడకకు ప్రజలు దూరంగా ఉంటూ వచ్చారు. ప్రస్తుతం కొవిడ్ భయానక పరిస్థితులు తగ్గముఖం పట్టడంతో ప్రజలంతా సంతోషంగా ఉట్టి కొట్టే పండుగను ఆనందంగా జరిపారు. ఈ క్రమంలోనే దహీ హండీ వేడుకల్లో ఓ 60 ఏళ్ల వృద్ధురాలు చేసిన ఫీట్ అందరినీ షాక్‌కు గురిచేసింది. ముంబైలో దహీ హండీ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ జరిగిన ఓ వింతకు సంబంధించి వీడియోను ఇండియన్‌ పోలీస్‌ సర్వీస్‌(ఐపీఎస్) అధికారి దీపాన్ష్‌ కాబ్రా షేర్ చేశారు. ఇందులో కొందరు మహిళలు మానవ పిరమిడ్‌ ఆకారంలో నిల్చున్నారు.ఈ క్రమంలో మహిళలపైకి ఎక్కి ఓ ముసలావిడ దహీ హండీలో భాగంగా ఏర్పాటు చేసిన కుండను(ఉట్టి)ని ఆమె తలతో బద్దలు కొట్టింది. తర్వాత తాడు సాయంతో నెమ్మెదిగా కిందకు దిగుతుంది. ఈ వీడియోపై దీపాన్ష్‌ కాబ్రా స్పందస్తూ ‘ది ఇన్‌క్రెడిబుల్ దాదీ’ అని ‍క్యాప్షన్‌ రాసి పోస్ట్ చేశారు. దెబ్బకు ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. వ్యూస్‌ పరంగా సంచలనం క్రియేట్ చేసింది. కొద్ది టైం లోనే 1,87,000 కంటే ఎక్కువ వ్యూస్‌ను, దాదాపు 10,000 లైక్‌లను సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. వృద్ధురాలి ధైర్యానికి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.