ఎద్దుల ముందు ఓవరాక్షన్ చేసిన యువ‌కులు.. చివ‌ర‌కి కింద‌ప‌డిపోయి..(వీడియో చూడండి)

జనం న్యూస్: సోష‌ల్ మీడియాలో నిత్యం ఎన్నో వీడియోలు వైర‌ల్ అవుతుంటాయి. ఎక్కువ‌గా జంతువుల వీడియోలు వైర‌ల్ అవుతుండ‌టం చూస్తూనే ఉంటాం. ఇందులో చాలా వీడియోలు ఫ‌న్ క్రియేట్ చేస్తుంటాయి. చాలా వ‌ర‌కు జంతువుల‌కు చిరాకు తెప్పిస్తే ఎదురుతిరుగుతుంటాయి. వాటిని ఇబ్బంది పెడితే య‌జ‌మానిపై కూడా దాడి చేస్తుంటాయి. ఎక్కువ‌గా పిల్లులు, కుక్క‌లు, కోతుల వీడియోలు నెట్టింట్లో ద‌ర్శ‌నం ఇస్తుంటాయి. అయితే జంతువులు కూడా ఒక్కోసారి తెలివిగా ఆలోచిస్తుంటాయి. మ‌నుషుల‌తో పోటీప‌డుతుంటాయి. వాళ్లు ఏది చేస్తే అదే చేస్తుంటాయి. అంతే కాకుండా కొన్ని ప‌నులు కూడా చేసి పెడుతుంటాయి. అలాగే వాటికి స‌రైన పుడ్ పెట్ట‌క‌పోతే మాత్రం ఇల్లంతా చింద‌ర వంద‌ర చేస్తుంటాయి. అలాగే సోష‌ల్ మీడియాలో ఎద్దుల‌కు సంబంధించిన వీడియోస్ కూడా తెగ వైర‌ల్ అవుతుంటాయి. ఒక్కోసారి మ‌నుషుల‌పై దాడి చేస్తుంటాయి. వాటిని మ‌చ్చిక చేసుకునే ప్ర‌య‌త్నంలో కొంద‌రు ఓవ‌ర్ యాక్ష‌న్ చేస్తుండ‌టంతో ఒక్క‌సారిగా ఎత్తి పడేస్తుంటాయి. ప‌దునైన కొమ్ముల‌తో దాడి చేస్తుంటాయి.  అయితే ఇందులో కొన్ని న‌వ్వు తెప్పిస్తే మ‌రికొన్ని భ‌య‌పెడుతుంటాయి. ప్ర‌స్తుతం ఇలాంటి సంఘ‌ట‌నే ఇప్పుడు నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. ఎద్దుల బండి ముందు బైక్ పై యువ‌కులు వెళ్తుండ‌గా ఒక్క‌సారిగా ఎద్దులు వాళ్ల‌పై దాడి చేశాయి. దీంతో కింద‌ప‌డిపోవ‌డ‌తంఓ తొక్కుకుంటూ వెళ్లిపోయాయి. ఓ చోట ఎద్దుల బండి పోటీలు జ‌రుగుతుండ‌టంతో వీడియో తీయ‌డానికి ప్ర‌య‌త్నించిన కొంద‌రు వ్య‌క్తులు బైక్ పై ఎద్దుల బండి ముందుగా వెళ్తూ షూట్ చేస్తూ స్టంట్లు వేయ‌డంతో ఎద్దులు స్పీడ్ గా వ‌చ్చి గుద్దేశాయి. దీంతో బైక్ పై ఉన్న యువ‌కులు కింద‌ప‌డిపోయారు. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది.