ఎన్టీఆర్ ను ఇలా చూస్తే అందరికీ పూనకాలే.. లీకైన ఎన్టీఆర్ దేవర సినిమా లుక్స్ మీరు కూడా చూసేయండి..

ఎన్టీఆర్ ను ఇలా చూస్తే అందరికీ పూనకాలే.. లీకైన ఎన్టీఆర్ దేవర సినిమా లుక్స్ మీరు కూడా చూసేయండి..

జనం న్యూస్: టాలీవుడ్‌లో ప్రస్తుతం ఎన్నో పాన్ ఇండియా రేంజ్ సినిమాలు తెరకెక్కుతున్నాయి. అందులో కొన్ని మాత్రం భారీ హైప్‌ను క్రియేట్ చేసుకుని సత్తా చాటుతోన్నాయి. అలాంటి వాటిలో 'దేవర' ఒకటి. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా.. బడా డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం ఇండియన్ అన్‌సీన్ కోస్టల్ ఏరియా బ్యాగ్‌డ్రాప్‌తో రూపొందుతోన్న విషయం తెలిసిందే. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న 'దేవర' మూవీకి సంబంధించిన షూటింగ్‌ను గత మార్చిలోనే ప్రారంభించారు. ఆ వెంటనే దీనికి సంబంధించిన మూడు భారీ యాక్షన్ షెడ్యూళ్లను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశారు. ఈ క్రమంలోనే త్వరలోనే నాలుగో దాన్ని కూడా ప్రారంభించబోతున్నారు. ఇలా నవంబర్ నాటికి ఈ సినిమా షూటింగ్ పార్టు మొత్తాన్ని పూర్తి చేయాలని చిత్ర యూనిట్ టార్గెట్‌గా పెట్టుకుని శరవేగంగా పని చేసుకుంటూ వస్తున్నారు. సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లో రాబోతున్న 'దేవర' మూవీలో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రను చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన పలు షెడ్యూళ్లలో కూడా పాల్గొన్నారు. ఎన్టీఆర్‌తో కలిసి కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లు చేశారు. ఇక, ఇందులో ఈ బాలీవుడ్ సీనియర్ హీరో చేసే రోల్ ఎంతో వైల్డుగా ఉంటుందని ఇప్పటికే న్యూస్ లీకైంది. దీంతో ఆయన అందరిలోనూ ఆసక్తి నెలకొందనే చెప్పాలి. 'దేవర' మూవీకి సంబంధించిన షూటింగ్ ప్రారంభమై చాలా రోజులే అవుతోంది. కానీ, దీని నుంచి కేవలం ఒక పోస్టర్ మాత్రమే విడుదలైంది. దీంతో ఫ్యాన్స్ నిరాశగా ఉన్నారు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రం నుంచి విలన్ పాత్రను చేస్తున్న సైఫ్ అలీ ఖాన్ ఫస్ట్ లుక్ పోస్టర్ రాబోతుందట. ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని ఆగస్టు 16వ తేదీన దీన్ని రిలీజ్ చేయబోతున్నట్లు తాజాగా ఓ న్యూస్ లీకైంది. 'జనతా గ్యారేజ్' హిట్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబోలో రాబోతున్న ఈ మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి యంగ్ సెన్సేషన్ అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో జాన్వీ హీరోయిన్ కాగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ మూవీని 2024 ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ చేస్తున్నారు.