ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతన పెంపుతో పాటు ప్రత్యేక సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేయాలి.

జనం న్యూస్, సెప్టెంబర్ 18విజయనగరంనేడు స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న రెవెన్యూ భవనంలో జిల్లా స్థాయి ఔట్సోర్సింగ్ ఉద్యోగుల మహాజనసభ జరిగాయి రాష్ట్ర ప్రభుత్వ శాఖల పని చేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని అందుకుగాను ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు జిల్లాలోని అన్ని శాఖల ఔట్సోర్సింగ్ ఉద్యోగులు అందరూ ఐక్యంగా ముందుకు సాగి సమస్యలపై నినదించాలని విజయనగరం జిల్లా ఏపీ జేఏసీ అమరావతి మరియు జిల్లా రెవెన్యూ అసోసియేషన్ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. జిల్లాస్థాయి ఔట్సోర్సింగ్ ఉద్యోగుల మహాజన సభ ఏపీ కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ విజయనగరం శాఖ ఆధ్వర్యంలో జరిగింది. ఈ మహాసభకు ముఖ్య అతిథులుగా విజయనగరం జిల్లా ఏపీజేఏసీ అమరావతి ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్, జిల్లా రెవెన్యూ ఉద్యోగుల అసోసియేషన్ చైర్మన్ భానుమూర్తి, జిల్లా ఏపీజేఏసీ అమరావతి ఉపాధ్యక్షులు గోవిందు, ఏపీ కాంటాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర కోశాధికారి గుర్నాథ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారుఈ సందర్భంగా మహాసభకు విచ్చేసిన ఉద్యోగులను ఉద్దేశించి ముఖ్య అతిథులు మాట్లాడుతూ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులు కింద స్థాయిలో అతి తక్కువ వేతనానికి సమయపాలన లేకుండా కూడా పనిచేస్తున్నారని తెలిపారు. ఉద్యోగులు సమస్యలను పక్కన పెడితే ముందు సంఘాన్ని బలోపేతం చేసుకుని తర్వాత సమస్యలపై నినదించాలని ఔట్సోర్సింగ్ ఉద్యోగులు సూచించారు. జిల్లాస్థాయిలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులు అందరూ ఐక్యంగా ఉండి రాష్ట్రస్థాయిలో జేఏసీని బలోపేతం చేసుకుని రాష్ట్ర సంఘం ద్వారా సమస్యలపై ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే విధంగా ముందుకు సాగాలని ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఎన్నికలకు వెళుతున్న నేపథ్యంలో క్రింది స్థాయిలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సాధకబాధకాలు కూడా పరిగణలోనికి తీసుకుని వేతనాలు పెంచాలన్నారు. వేతనాలు పెంపుతో పాటు ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ప్రత్యేక సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే తక్కువ వేతనానికి పనిచేస్తున్న చిరుద్యోగులకు ప్రభుత్వ పథకాలు అన్నిటిని వర్తింప చేసే విధంగా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఏపీ కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు జేఏసీ రాష్ట్ర కోశాధికారి గురునాథ్ అక్టోబర్ నెలలో రాష్ట్రస్థాయిలో ఏర్పాటు చేయబోయే రాష్ట్రస్థాయి ఔట్సోర్సింగ్ ఉద్యోగుల మహాజన సభకు జిల్లా నుండి పెద్ద ఎత్తున ఔట్సోర్సింగ్ ఉద్యోగులు తరలిరావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వాలు రెగ్యులర్ ఉద్యోగుల సమస్యల తోపాటు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే దిశగా చొరవ చూపాలని సమస్యల పరిష్కారానికి ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ తోడ్పాటునందిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున జిల్లాలో అన్ని శాఖల ఔట్సోర్సింగ్ ఉద్యోగ సంఘం ప్రతినిధులు మరియు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.