కబ్జా జరిగిన భూములు బయటకు తీస్తాం....

కబ్జా జరిగిన భూములు బయటకు తీస్తాం....

ప్రభుత్వ భూములు కబ్జా పెడితే  ఎవ్వరిని ఉపేక్షించేది లేదు ...  ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్
జనం న్యూస్ టుడే: సత్తుపల్లి .

ఖమ్మం జిల్లా, సత్తుపల్లి పట్టణం - వైశ్యకాంతల చెరువు, తామర చెరువు,  గాడుదుల వాగుల చెరువులను అధికారులు తో కలిసి పరిశీలించిన సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ , రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ .
సత్తుపల్లి పట్టణంలో వేశ్యకాంతల చెరువు అలాగే  తామర చెరువు, గాడుదుల వాగును ఈరోజు సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి మట్టా రాగమయి దయానంద్ కలిసి  పరిశీలించారు.... వేశ్యకాంతల చెరువు మెరక తూమును రిపేరు చేయవలసిందిగా రైతులు కోరగా వెంటనే ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు .
అనంతరం చెరువు మొత్తం పరిశీలిస్తూ చెరువుల్లో మిగిలిన పూడికను కూడా తీసే అవకాశాన్ని కూడా పరిశీలించాల్సిందిగా ఆదేశించారు. వేశ్యకాంతల చెరువు కట్టమీద, ఎన్టీఆర్ కెనాల్ కట్టమీద వర్షాకాలం ప్రారంభం కాగానే మొక్కలు నాటి సింగరేణి వారిచే సంరక్షణ బాధ్యత తీసుకునే విధంగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు, అనంతరం ఎన్టీఆర్ కెనాల్ మీదుగా బేతుపల్లి చెరువు వరకు వెళ్లి కాలువను పరిశీలించారు. కాలవలో ఉన్న ముళ్ళకంపను శుభ్రం చేయవలసిందిగా ఇరిగేషన్ అధికారులు ఆదేశించారు. అనంతరం గాడిదల వాగును పరిశీలించి వాగు ఆక్రమణ లో ఉండటం వలన వరదలు వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది అని ప్రజలు తెలియజేయగా ఆక్రమణలో ఉన్న వారిని తొలగించి వేశ్యకాంతల చెరువు వరకు గాడుదుల వాగు నుండి ఇబ్బంది లేకుండా నీరు వెళ్లే ఏర్పాటు చేయాలని ఇరిగేషన్ అధికారులు ఆదేశించారు....అనంతరం తామరచెరువు పరిశీలించారు.
పోడు భూములను పరిశీలించారు. తామర చెరువు ఆయకట్టు రైతులు చెరువు తూములు పాడవడం వల్ల రైతులకు ఇబ్బంది కలుగుతుందని , గత ప్రభుత్వం చెరువు కాంట్రాక్టు నాసిరకమైన పనులు చేయడం వలన ఈ ఇబ్బంది వచ్చిందని ఎమ్మెల్యే గారికి తెలియజేశారు. చెరువు భూములు ను సర్వే చేపించి భూ ఆక్రమణ జరగకుండా సర్వే రాళ్లు వేపించి ప్రభుత్వ భూములను కాపాడాలని అధికారులు ను ఆదేశించారు. ఏ పార్టీ వారైనా, ఎంతటి వారైనా సరే ప్రభుత్వ భూములు కబ్జా చేసి ఉంటే వారిని ఉపేక్షేంచేది లేదు అని హెచ్చరించారు. 
 ఈ కార్యక్రమం లో రైతులు , గ్రామ ప్రజలు , ప్రభుత్వ అధికారులు , నాయకులు పాల్గొన్నారు.