.కమిషనరేట్ కార్యాలయంలో ఘనంగా జాతీయ సమైక్య దినోత్సవ వేడుకలు

.కమిషనరేట్ కార్యాలయంలో ఘనంగా జాతీయ సమైక్య దినోత్సవ వేడుకలు

జనం న్యూస్ సెప్టెంబర్ 17( సబ్బు సతీష్  రీపోటర్ ) పెద్దపల్లి  జాతీయ సమైక్య దినోత్సవ వేడుకలను రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో  ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భముగా రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి ఐపిఎస్., (డిఐజి) పోలీస్ కమిషనరేట్ కార్యాలయం భవనం వద్ద జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం అధికారులకు, సిబ్బందికి పోలీస్ కమిషనర్  జాతీయ సమైక్య దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు తెలియజేసారు.ఈ కార్యక్రమం లో  గోదావరిఖని ఏసీపీ తులా శ్రీనివాస్ రావు, టాస్క్ ఫోర్స్ ఏసిపి  మల్లారెడ్డి స్పెషల్ బ్రాంచ్ ఏసిపి  వెంకటేశ్వర్లు,  ఇన్స్ స్పెక్టర్లు, ఆర్. ఐ లు, ఎస్. ఐ లు ఇతర వింగ్స్ చెందిన పోలీస్, సీపీఓ సిబ్బంది పాల్గొన్నారు.