కాంగ్రెస్ విజయభేరి సభను విజయవంతం చేయండి - పిసిసి మెంబర్ పత్తి కృష్ణారెడ్డి

కాంగ్రెస్ విజయభేరి సభను విజయవంతం చేయండి  - పిసిసి మెంబర్ పత్తి కృష్ణారెడ్డి

 జనం న్యూస్ కరీంనగర్ నవంబర్ 20:---( కరీంనగర్ జిల్లా ప్రతినిధి రాచర్ల వేణుఈనెల 23న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంటలో నిర్వహించే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాజరుకానున్నట్లు తెలిపారు సభను విజయవంతం చేయాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడు పత్తి కృష్ణారెడ్డి కోరారు. సోమవారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, రాష్ట్రంలో కాంగ్రెస్ దే అధికారమని అన్నారు. జమ్మికుంట పట్టణంలోని డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించే సభకు ప్రజలు కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశానికి టీపీసీసీ నాయకులు హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో హుజరాబాద్ మండల అధ్యక్షుడు కొల్లూరి కిరణ్. ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు చెల్లూరి రాహుల్. మైనార్టీ సెల్ పట్టణ అధ్యక్షుడు ఎండి అప్సర్ సీనియర్ నాయకులు మేకల తిరుపతి .చిట్యాల శంకర్ తదితరులు పాల్గొన్నారు