కెమెరా కంటికి చిక్కి అందరికీ వెన్నులో వణుకు పుట్టిస్తున్న విచిత్ర జీవి మొహం.. అసలు ఇదేంటి..!
జనం న్యూస్: సముద్రం నీటిలో జీవించే సమస్త జీవరాశికి నిలయం. కంటికి కనిపించనంత చిన్న పరిమాణంలో ఉండే ప్రొటోజోవన్‌లు మొదలు భారీ తిమింగలాల వరకు ఎన్నో జీవులు సముద్రంలో ఆవాసం చేస్తున్నాయి. వాటిలో రంగురంగుల చేపలు, స్టార్ ఫిష్‌లు, ఆల్చిప్పలు, చూడముచ్చటగా ఉంటే.. షార్క్ చేపల లాంటి కొన్ని జీవులు వెన్నులో వణుకుపుట్టిస్తాయి. మరికొన్ని జీవులేమో చూడటానికి సాహసించలేనంత వికృతంగా ఉంటాయి. అలాంటి ఓ వికృత జీవికి సంబంధించిన ఫొటోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పియట్రో ఫోర్మిస్ అనే అండర్ వాటర్ ఫొటోగ్రాఫర్.. వికృత ముఖంతో ఉన్న ఓ చేపను తన కెమెరాలో బంధించాడు. వైల్డ్ లైఫ్ ఫొటో గ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ కాంపిటీషన్‌లో భాగంగా సముద్రంలోకి వెళ్లిన పియట్రో ఈ దెయ్యం చేప ముఖాన్ని ఫొటో తీశాడు.