గణేష్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు..

జనంన్యూస్) సెప్టెంబర్ 18: రాయికల్ మండలం అల్లిపూర్ గ్రామంలో గణేష్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి బొజ్జగణపయ్యల, ప్రతిమలు శోభాయమానంగా, కొలువుదీరాయి ప్రత్యేకంగా రూపొందించిన మంటపల్లో గణనాథుడిని ప్రతిష్టించి భక్తిశ్రద్ధలతో పూజిస్తున్నారు కొందరు ఇంట్లో కూడా స్వామివారికి ప్రత్యక్ష పూజలు చేస్తున్నారు, ఉదయం నుంచి అన్ని గణేష్ మంటపాల్లో భక్తులు పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొని  విఘ్నేశ్వరుడిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో గణేష్ యూత్ సభ్యులు, అధ్యక్షులు కొంక గంగాధర్, ఉపాధ్యక్షులు, పోల శ్రీనివాస్, సహాయ కార్యదర్శి ఎర్రవేణి తిరుపతి, కోశాధికారి గేల్లె రాజు, సభ్యులు ఉరుమడ్ల సంజీవ్, గేల్లె రాజు, కట్ట అశోక్, శేఖర్, గంగరాజు, శ్రీనివాస్, రమేష్, ప్రవీణ్, వెంకటేష్, రాజేశం,అశోక్, తదితరులు పాల్గొన్నారు.