గ్రామస్తుల ధర్నా.

గ్రామస్తుల ధర్నా.

vజనం న్యూస్ నాగారం జనవరి 12,మండలంలోని డీకొత్తపల్లి గ్రామంలో ఢీకొత్తపల్లి నుండి శాంతినగర్ వరకు వెళ్లే బీటీ రోడ్డు విస్తరణ కోసం ఇండ్లు ఇండ్ల స్థలాలు నష్టపోయినటువంటి వారి కోసం గ్రామంలో అన్ని పార్టీలకు సంబంధించిన పెద్దమనుషులు ఢీకొత్తపల్లి కి సంబంధించిన వారికి డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయిస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వడం లేదు అని. డబల్ బెడ్ రూమ్ ఇండ్లు మాకు కేటాయించాలని నష్టపోయిన వారు రోడ్డు మీద ధర్నాకు దిగడం జరిగింది. ఈ ధర్నాకు గ్రామపంచాయతీ సెక్రెటరీ అరుణ్ కుమార్ వచ్చి ఈ ఒక్క అంశాన్ని గ్రామసభలో మాట్లాడి ఈ యొక్క సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తామని చెప్పడంతో ధర్నా విరమింప చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవరకొండ వెంకన్న, ఒడిశాల వెంకటయ్య, రావుల వీరయ్య, గైగుల సైదులు, తదితరులు పాల్గొన్నారు.