చలో మహానాడు బుచ్చిబాబు పిలుపు

చలో మహానాడు   బుచ్చిబాబు పిలుపు

జనం న్యూస్ మే 25 కాట్రేని కొనఈరోజు  ఉదయం  మురమళ్ళ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ టీడీపీ ఇన్-చార్జ్ శ్రీ దాట్ల సుబ్బరాజు గారు అద్యక్షతన  ఈనెల 27, 28 తేదీ లలో రాజమండ్రి లో జరుగుబోయే  మహానాడు కార్యక్రమం కోసం ముమ్మిడివరం నియోజకవర్గంలో మహానాడు చర్చ సమావేశం ఏర్పాటు చేసినారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా ముమ్మిడివరం నియోజకర్గం పరిశీలకులు కాకినాడ మాజీ డిప్యూటీ మేయర్ శ్రీ కాళా సత్తిబాబు గారు విచ్చేసినారు.ఈ సమావేశంలో ముమ్మిడివరం మాజీ శాసనసభ్యులు మరియు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు దాట్ల సుబ్బరాజు(బుచ్చిబాబు) గారు మాట్లాడుతూ ఈనెల 27, 28 తేదీ లలో రాజమండ్రి లో జరుగుబోయే  మహానాడు కార్యక్రమానికి ముమ్మిడివరం నియోజకర్గం నుండి సుమారు అక్షరాల 15 వేలమంది నాయకులు,కార్యకర్తలు,తెలుగుదేశం పార్టీ అభిమానులు తరలివెళ్ళాలని ఆదేశించారు.ముమ్మిడివరం నియోజకవర్గం నుండి నాలుగు మండలాలు,ఒక నగర పంచాయతి కలిపి ఒక్కొక్క మండలానికి 3000 చెప్పున మొత్తం 15 వేల మంది వెళ్ళాలి అన్నారు.అనంతరం కాట్రేనికోన మండలం తెలుగుదేశం పార్టీ యువనాయకులు వెంట్రు సుధీర్ గారు పుట్టినరోజు సందర్బంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ దాట్ల బుచ్చిబాబు గారు సమక్షంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.