చొప్పదండి శివ-కేశవాలయానికి 1015 సం"రాల చరిత్ర

చొప్పదండి శివ-కేశవాలయానికి 1015 సం"రాల చరిత్ర

సబ్ టైటిల్ -1)శివకేశవ ఆలయ బ్రహ్మోత్సవాలు 18-02-2023 శనివారం నుండి 24-02-2023 శుక్రవారం వరకు

సబ్ టైటిల్ -2)బండ్ల మహోత్సవము22-02-2023బుధవారం రోజున 

సబ్ టైటిల్-3)జాతర మహోత్సవము24-02-2023 శుక్రవారం రోజున

జనం న్యూస్ ఫిబ్రవరి 18 చొప్పదండి చొప్పదండి పట్టణం లోని శివకేశ ఆలయం లో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామి వారి దర్శనానికి వచ్చిన భక్తులతో ఆలయం  కిక్కిరిసిపోయింది.వంశపారంపర్య పూజారులచే,మంత్రోచ్చారణ లతో అఖండ పూజలు జరుగుతున్నాయి.ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో శివకేశవులు ఇరువురు ఎదురుగా వెలిసి పూజలందుకోవడం విశేషం.

శివకేశవ ఆలయ గత చరిత్ర

కీ॥ ॥ 1009 ఒక శాసనము ఈనాటి శివకేశవాలయము 2023 సం॥రం వరకు ఆలయ నిర్మాణము జరిగి 1015 సంవత్సరాలు నిండినవని శాసనం ప్రకారం తెలుస్తున్నది)కళ్యాణి చాళుక్యుల సామ్రాజ్యంలో చొప్పద్యాండిగా విలసిల్లిన ఈనాటి చొప్పడండికి విశేష ప్రాధాన్యత ఉందని ఇక్కడిశాసనాల ద్వారా తెలుస్తున్నది. వీరి కాలంలో చొప్పద్యాండిగా ఉన్న పేరు కాలక్రమేణా చొప్పదండిగా మారింది. చొప్పదండిలోచాళుక్యుల కాలంనాటి శాసనాలు లభించాయి. బేలకుంట సమీపంలో కీ॥శ॥ 922లో చాళుక్యు రాజుల్లో అహవ మల్లదేవబిరుదాంకితుడైన రెండవ తైలపుని కాలానికి చెందిన దుగ్గారాముడు అని అధికారి కూతురయిన అచబ్బె (ఆచవ్వ) పేరిట ఈశాసనం లభించింది. ఇరువలేండిగా బిరుదున్న సత్యాశ్రమ కళ్యాణి చాళుక్య ప్రభువు కాలంలో దేవకబ్బె అనే ఆమె కీ॥శ॥1009లో ఒక శాసనమే ఈనాటి శివకేశవాలయం. ఈ శాసనం దెపకబ్బె రూపొందించింది. ఈ శివకేశవాలయం విశాలమైనప్రాకారాల మధ్య పెద్ద శిలలతో నిర్మితమై తూర్పు వైపు ముఖం ఉన్నది. గర్భగృహం, అర్ధమండపం, ఒకదానినానుకొనిమరొకటిగా ఉన్న నిర్మాణాల గర్భగృహంపై మెట్లతో కూడుకొని పిరమిడ్ ఆకారంతో క్రమంగా పైకి సన్నగా గల చాళుక్య శివకేశవ ఆలయాలు కలవు. ప్రాకారము రాతిచే నిర్మించబడి మధ్యలో సొరంగ మార్గముండుట దీనిప్రత్యేకత.దేవాలయమునకు
దక్షిణ దిశయందు జనమేజయుని కాలం నాటి యజ్ఞగుండం కలదు. అది పదకొండు గజముల పొడవు వెడెల్పుతోచతురస్రాకారముగా ఉన్నది.అది దేవాలయ కోనేరుగా ప్రచారమొందింది.దక్షిణ దిశలో వీరభద్రస్వామి ఆలయం, మండపంకుఎదురుగా సేదతీర్చుకుంటున్న నందీశ్వరుడు కలడు.పూర్వీకుల కథనం ప్రకారం ఇక్కడ శివలింగం ఇసుకతో చేసినదని వారికథనం మరియు ఇక్కడి లింగానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని వారి నమ్మకం.అలాగే శివకేశవ ఆలయాలు రెండు ఎదురెదురుగాఉండటం ఇట్టి దేవాలయ ప్రత్యేకత. ఈ ఆలయములో ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాస శుద్ధ పంచమి రోజున శంభుస్వామి జాతర జరుగుతుంది. ఇట్టి జాతరకు ప్రజలు వేలాదిగా వచ్చి స్వామివార్లను దర్శించుకొని తరిస్తారు.