జూనియర్ కళాశాలను సీజ్ చేయించిన ఏబీవీపీ

జూనియర్ కళాశాలను సీజ్  చేయించిన ఏబీవీపీ

జనం న్యూస్ మెదక్ జిల్లాలో వెస్లీ జూనియర్ కళాశాల అక్రమాలను అడ్డుకున్న జూనియర్ కాలేజ్ సెలబ్రేషన్ ఏబీవీపీ  కనీస మౌలిక వసతులు లేని వెస్లీ జూనియర్ కళాశాలను సీజ్ చేయించిన ఏబీవీపీ అమ్మాయిలకు లైంగిక వేధింపులు చేసిన ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోవాలిఅఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మెదక్ శాఖ ఆధ్వర్యంలో మెదక్ పట్టణంలోని స్థానిక వెస్లీ జూనియర్ కళాశాల ముందు ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మెదక్ ఉమ్మడి జిల్లా కన్వీనర్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ వెస్లీ జూనియర్ కళాశాలలో కనీస మౌలిక వసతులు లేకుండా లెక్చరలు లేకుండా క్లాస్ రూమ్ లు లేకుండా ల్యాబ్ సంబంధించిన ఫెసిలిటీస్ లేకుండా ఫైర్ సేఫ్టీ లేకుండా కళాశాలను ఏ విధంగా నడుపుతారని విద్యార్థులకు ఏ విధంగా బోధన చేసి విద్యార్థులకు న్యాయం చేస్తారని  అని  డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించడం జరిగింది కళాశాలలో అడ్మిషన్లు జరిగే సమయంలో ఉచిత బోధనా అని చెప్పి కళాశాల విద్యా ముగించుకున్న విద్యార్థుల దగ్గర అధిక అధికంగా ఫీజులు ఇస్తేనే సర్టిఫికెట్లు ఇవ్వకుండా విద్యార్థులతో దురుసుగా ప్రవర్తించిన ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోవాలని  అలాగే అమ్మాయిలకు వారి యొక్క సర్టిఫికెట్స్ కావాలని అడిగితే వారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ లైంగిక వేధింపులు చేసిన ప్రిన్సిపల్ పై ప్రిన్సిపల్ చంద్రపాల్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మెదక్ డి ఐ ఈ ఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అలాగే ఎలాంటి మౌలిక వసతులు లేని కళాశాలను గుర్తింపు రద్దుచేసి కళాశాలను వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేసి డిఐఈఓ గారిని కళాశాల వద్దకు పిలిచి కళాశాలను సీజ్ చేయించడం జరిగింది కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థినీ విద్యార్థులను ప్రభుత్వ కళాశాలలకు తరలించడం జరిగింది ఇలాంటి ఘటనలు జిల్లా వ్యాప్తంగా  ఉన్న అన్ని ప్రైవేట్ కళాశాలలో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం  జరిగింది  ఇలాంటివి జిల్లాలో ఎక్కడ జరిగినా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్  ఊరుకునే ప్రసక్తే లేదు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతుందని హెచ్చరించడం జరిగింది వెంటనే డిఐఈఓ గారు అన్ని ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలలను సందర్శించి వారి యొక్క సమస్యలను తెలుసుకొని పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తుంది ఇలాంటి ఘటనలు ఎప్పుడూ కూడా  పునరావృతం కావద్దని హెచ్చరించడం జరిగింది కళాశాలలో చదువుకున్న విద్యార్థులందరికీ ఎలాంటి ఫీజులు లేకుండా వారి యొక్క సర్టిఫికెట్స్ ఇవ్వాలని చెప్పి వారికి సర్టిఫికెట్ ఇప్పించడం జరిగింది మిగతా విద్యార్థులు కూడా వచ్చి సర్టిఫికెట్ తీసుకోవాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా కన్వీనర్ శశికాంత్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భాను నాయకులు అఖిల్ గణేష్ ప్రశాంత్ అనిల్ తదితరులు పాల్గొన్నారు