తెలుగుదేశం పార్టీ గెలుపుకు శ్రమించిన జగదీష్ కు ఘన సత్కారం

తెలుగుదేశం పార్టీ గెలుపుకు శ్రమించిన జగదీష్ కు ఘన సత్కారం

జనం న్యూస్ జూన్ 10 (అనకాపల్లి జిల్లా)

తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉదయం పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు రాష్ట్ర తెలుగుదేశం కార్యనిర్వాహక కార్యదర్శి మాజీ శాసనమండలి సభ్యులు మాజీ జిల్లా అధ్యక్షులు బుద్ధ నాగ జగదీశ్వరరావును గత 5 సంవత్సరాల నుండి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకు రావడంలో జిల్లాలో అన్ని నియోజకవర్గాలు పర్యటించి వైసిపి అరాచకాలు దోపిడీలు అవినీతి అక్రమాలపై పోరాటాలు చేసి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లో బలంగా తీసుకువెళ్లారని, ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి అభ్యర్థి కొణతాల రామకృష్ణ బిజెపి పార్లమెంట్ అభ్యర్థిగా సీఎం రమేష్ విజయానికి విశేషంగా కృషి  చేశారని, ఇరువురు అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో కొణతాల రామకృష్ణ శాసనసభ్యులుగా సీఎం రమేష్ పార్లమెంట్ సభ్యులుగా ఘన విజయం సాధించారని, ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పార్లమెంట్ కార్యాలయంలో నాగ జగదీష్ ని ఘనంగా పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు తరలివచ్చి సత్కరించారని తెలుగుదేశం పార్టీ మీడియా కోఆర్డినేటర్ కొణతాల వెంకటరావు తెలిపారు. ఈ సందర్భంగా నాగ జగదీష్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో నేనొక కార్యకర్తగా ప్రవేశించి అంచెలంచెలుగా పార్టీలో నా సేవలు గుర్తించి ఆనాటి శాసనసభ్యులు దాడి వీరభద్రరావు శ్రీశ్రీశ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానం చైర్మన్ గా, మున్సిపల్ కౌన్సిలర్ గా, కౌన్సిల్ ప్రతిపక్ష నేతగా, వుడా డైరెక్టర్ గా, పట్టణ శాఖ అధ్యక్షులుగా పదవులు నిర్వహించిన తరువాత, నియోజకవర్గంలో సంక్షోభం రావడంతో కోర్ కమిటీ బాధ్యతలు నిర్వహించి స్థానిక సంస్థల సర్పంచులు ఎంపీటీసీ, జడ్పిటిసి  విజయాన్ని సాధించామని, దీన్ని గుర్తించిన  రాష్ట్ర అధిష్టానం జిల్లా ప్రధాన కార్యదర్శిగా, జిల్లా అధ్యక్షులుగా శాసనమండలి సభ్యునిగా తెలుగుదేశం అధినేత జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు నన్ను గుర్తించి శాసనమండలి సభ్యులుగా నియమించారని, నాకు ఆర్థిక బలం లేదని, అంగబలం లేదని, నాకున్నది కార్యకర్తలు  నాయకులు సహకారం మాత్రమే ఉందని, పార్టీని నమ్ముకుని వారి ఆదేశాలకు అనుగుణంగా నేను పని చేస్తున్నానని, ఎల్లప్పుడూ  తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందుబాటులో ఉంటానని, సత్కారాలు వద్దని చెప్పినా కార్యకర్తలు నాయకులు ప్రోత్సాహంతో తప్పలేదని వారి సహకారాన్ని మరిచిపోలేనని నేను ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలకు నాయకులకు విధేయుడుగా ఉంటానని నాగ జగదీష్ అన్నారు.  ఈ కార్యక్రమంలో కోట్ని రామకృష్ణ బోడి వెంకటరావు కుప్పిలి జగన్ మల్ల శివన్నారాయణ మల్ల గణేష్ బొడ్డేడ మురళి జంపా మల్లికార్జునరావు  విల్లూరి రమణబాబు పిల్లా తారకేశ్వరరావు కర్రి గోపి కాండ్రేగుల ముకుంద కొణతాల వాసు పెంటకోట శ్రీను గుడాల సత్యనారాయణ పూడి త్రినాథ్ దొడ్డి జగదీష్ కర్రి మల్లేశ్వరరావు కోట్ని ఉమా కాయల ప్రసన్నలక్ష్మి వేదుల సూర్యప్రభ, బీశెట్టి హేమ కూరాకుల భారతి పొలిమేర నాయుడు దూలం ప్రసాద్ కోట్ని రాంబాబు మారిశెట్టి శంకర్రావు సాలాపు నాయుడు చదరం శివ అప్పారావు దాడి అప్పారావు దొడ్డి జగదీష్ తదితరులు నాగ జగదీష్ ను సత్కరించారు.//