త్వరలోనే.. సూపర్ స్టార్ మహేష్ బాబు వైసీపీలోకి ఎంట్రీ... ఎప్పుడంటే..?

త్వరలోనే.. సూపర్ స్టార్ మహేష్ బాబు వైసీపీలోకి  ఎంట్రీ... ఎప్పుడంటే..?

జనం న్యూస్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారట.ఇప్పటికే ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను చేపడుతున్న మహేష్ బాబు ప్రత్యక్ష రాజకీయాల్లో చేరడం ద్వారా సమాజ సేవ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులతోనూ చర్చించగా, గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే మహేష్ బాబు సొంత బాబాయి ఆదిశేషగిరిరావు వైసీపీలో కీలక నేతగా కొనసాగుతున్నారు. ఆయన సంప్రదింపుల మేరకు నవంబర్ 2వ తేదీన సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. ఈ వార్త ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. మరి ఈ వార్త ఎంత మాత్రం నిజమో తెలియాలంటే నవంబర్ 2వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.