దళిత యువకుడితో చెప్పులు నాకించుకున్న విద్యుత్ అధికారి.. చెప్పుతో కొట్టాలి వీడిని..

జనం న్యూస్: ఇంకా ఈ కులాలు, మతాలు ఏంటి. అసలు ఈ రోజుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఉదయం ఇంటికి వెళ్లిన వ్యక్తి రాత్రికి తిరిగి ఇంటికి వచ్చేదాకా అది నమ్మకం ఉండదు. అలాంటి వాళ్లు ఇంకా కులాలు, మతాలు అని పట్టుకొని వేలాడుతుంటారు. తక్కువ కులం వాళ్లకు చీప్ గా చూస్తుంటారు. చులకనగా చూస్తుంటారు. అసలు ఈ కులాలను దేవుడు పుట్టించాడా? మనకు మనం పుట్టించుకొని తక్కువ కులం వాళ్లను ఎక్కువ కులం వాళ్లు డామినేట్ చేసే పరిస్థితుల్లో ఉన్నాం. అలాంటి ఘటనలు రోజూ ఎన్నో చూస్తున్నాం. తాజాగా ఉత్తర ప్రదేశ్ లో అటువంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఏకంగా దళిత యువకుడిని తన చెప్పులు నాకించుకున్నాడు అగ్ర కులానికి చెందిన వ్యక్తి. అగ్ర కులానికి చెందిన వాళ్లకు దళితులు, గిరిజనులు అంటే చిన్నచూపు. అందరికీ కాదు కానీ.. కొంతమంది అలా ఉంటారు. అటువంటి వాళ్ల వల్లనే అగ్ర కులాల పరువు పోతోంది.తాజాగా ఓ వీడియో వైరల్ అవుతోంది. ఉత్తర ప్రదేశ్ లో దళిత యువకుడితో విద్యుత్ ఉద్యోగి చెప్పులు నాకించుకున్నాడు. ఆ తర్వాత ఆ దళిత యువకుడు.. విద్యుత్ ఉద్యోగి ముందు గుంజీలు కూడా తీశాడు. దానికి సంబంధించిన వీడియో యూపీ వ్యాప్తంగా వైరల్ కావడంతో ఆ ఉద్యోగిని విద్యుత్ శాఖ సస్పెండ్ చేసింది. ఆ వీడియోను చూసిన నెటిజన్లు.. చెప్పులు నాకించుకున్న ఉద్యోగిపై మండిపడుతున్నారు. చీ.. ఇంత దారుణమా. దళితులు అయితే మాత్రం అంత చిన్నచూపా? వాళ్లు అంత చులకనగా కనిపిస్తున్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.