దారుణం..కలకలం రేపుతున్న ర్యాగింగ్ బూతం.. జూనియర్లను చచ్చేలా కొట్టిన సీనియర్.

జనం న్యూస్: సీనియర్లను జూనియర్లను క్వశ్చన్ చేయకూడదు’ఇది ఓ సినిమాలోని డైలాగ్. కాలేజ్ అనగానే జూనియర్లు, సీనియర్లు ఉండటం కామన్. జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్ చేస్తూ ఆధిప్యతం చెలాయిస్తుంటారు సీనియర్లు. జూనియర్ దశను అనుభవించిన విద్యార్థులే.. సీనియర్లు అయ్యాక.. తమ జూనియర్లను ర్యాగింగ్ చేయడం, పనీష్మెంట్ లాంటివి చేస్తుంటారు. వారి చెప్పిందీ చేయకపోతే వారికి చుక్కలు చూపిస్తారు. ఈ ర్యాగింగ్ భూతానికి అనేక మంది విద్యార్థులు బలైన సందర్భాలున్నాయి. దీనిపై పోరాటమే చేయడంతో ఇటీవల కాలంలో కాస్త తగ్గిందనే చెప్పవచ్చు. ఇప్పుడు మళ్లీ కాలేజీలు మొదలైతే.. ఇక కొత్తగా కాలేజీకి వచ్చే విద్యార్థులు.. సీనియర్ చేతుల్లో ఎలాంటి తిప్పలు పెడతారోనన్న భయంలో బతుకుతుంటారు. తాజాగా జూనియర్లను ఇష్టమొచ్చినట్లు చితక్కొట్టి తన కసిని తీర్చుకున్నాడో సీనియర్ . దారుణంగా జూనియర్లను సీనియర్ చావబాదిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఈ ఘటన మహారాష్ట్రలోని థానేలోని జోషి బెడేకర్ కాలేజీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..జోషి బెడేకర్ కళాశాల ఆవరణలో బండోద్కర్, బేడేకర్, పాలిటెక్నిక్ ఇలా మూడు విభాగాల విద్యార్థులకు ఉమ్మడి ఎన్‌సీసీ శిక్షణ ఇస్తోంది. ఈ సమయంలో విద్యార్థులకు సైన్యం, నేవీ శిక్షణకు ఫిజికల్ ట్రైనింగ్ క్లాసులు చెబుతారు. ఇందులో భాగంగా ఎన్‌సీసీలో జూనియర్లకు శిక్షణ నిచ్చే నేపథ్యంలో సీనియర్.. వర్షంలో వరద నీటిలో పుషప్స్ పొజిషనల్‌లో ఉంచి.. ఆపై ప్లాస్టిక్ పైపును తీసుకుని విద్యార్థుల వెనుక భాగంలో పైపులతో చితకబాదాడు. చివరి విద్యార్థి తట్టుకోలేక లేవగా.. పదేపదే అదే పైపుతో దారుణంగా కొట్టాడు. ఈ వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అవుతుంది. అందులో ఓ యువతి మాటలు వినిపిస్తున్నాయి. సుమారు 15 నిమిషాల నుండి ఇలానే జరుగుతుందని, ఇది అవమానీయ ఘటన అని, వ్యక్తిగత కక్షతోనే ఇలా చేస్తున్నాడన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎన్‌సీసీ మీ పిల్లలు పంపొద్దు అంటూ పేర్కొంది. ఈ వీడియోపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఈ ఘటన కాలేజీ ప్రిన్సిపాల్ దృష్టికి వెళ్లగా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని చెప్పారు. అధ్యాపకులు గైర్హాజరైన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని ప్రిన్సిపల్ తెలిపారు.