నడి రోడ్డుపై అందరిముందూ పోలీసును చావకొట్టిన యువకుడు..! ఎందుకో తెలుసా..? (వీడియో చూడండి)

జనం న్యూస్: మందు బాబులు, ఆకతాయిల బెడద రోజురోజుకు పెరిగి పోతున్నది. ఒకప్పుడు పోలీసులను చూసి బెదిరిపోయే ఆకతాయిలు ఇప్పుడు పోలీసులకు కూడా భయపడటం లేదు. ఏకంగా పోలీసులపై దాడులకు పాల్పడుతున్నారు. డ్యూటీలో ఉన్న పోలీసులు అని కూడా చూడకుండా వారి పైన దాడికి పాల్ప డుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో జ‌రిగింది. ఫుల్లుగా మద్యం తాగి పోలీసునే చితకబాదాడో వ్యక్తి. పబ్లిక్ ప్లేస్ లో పోలీసును కొడుతున్న వీడియో వైరల్ కావడంతో పోలీసులు ఆ వ్య‌క్తి ప‌ట్టుకునే ప‌నిలో ప‌డ్డారు.అయితే జై ప్రకాశ్ జైస్వాల్ ల‌నే పోలీస్ కానిస్టేబుల్ లంచ్ చేయడానికి ఇంటికి వెళ్తున్నాడు… మార్గంలో పోతున్న వ్యక్తికి జైశ్వాల్ బైక్ టచ్ అయింది. దాంతో వాదన మొదలైంది. దీంతో కానిస్టేబుల్ వద్ద ఉన్న లాఠీని తీసుకున్న ఆ వ్యక్తి కొట్టడం మొదలుపెట్టాడు. తప్పించుకునే క్రమంలో పారిపోతున్నా వెంబడించి కొట్టాడు. పలు గాయాలపాలైన జైస్వాల్ ఏరోడ్రామ్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశాడు.కానిస్టేబుల్ కంప్లైంట్ తీసుకుని సెక్షన్ 307 ప్రకారం.. హత్యాయత్నం కింద కేసు ఫైల్ చేసి నిందితుడ్ని పట్టుకునే పనిలో పడ్డారు పోలీసులు.కాగా అక్కడ స్థానిక ప్రజలు వీడియో తీయడం వల్ల ఆ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది… దీంతో ఆ వీడియో పోలీసుల‌ దాకా చేరింది. ఇక సరైన వివరాలు తెలుసుకున్న పోలీసులు వెంటనే దర్యాప్తు చేసి ఆ వ్యక్తి ని అదుపులోకి తీసుకున్నారు.