నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలలో దేవాలయంలో ప్రత్యేక పూజలు

జనం న్యూస్ సెప్టెంబర్ 18 కాట్రేను కొననరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా బిజెపి శ్రేణులు కుండలేశ్వరం దేవాలయంలో ప్రత్యేక పూజలు కాట్రేనికోన ఈరోజు మన ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం కుండలేశ్వరం పంచాయతీ శ్రీ పార్వతీ సమేత కుండలేశ్వర స్వామి వారి ఆలయంలో బిజెపి కార్యకర్తలు జిల్లా నాయకులు మండల నాయకులు దేశ ప్రధాని నరేంద్ర మోడీ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని దేశాన్ని సుభిక్షంగా పరిపాలన చేయడం కోసం స్వామివారు మరింత శక్తిని కలుగజేయాలని రాబోయే ఎన్నికలలో తిరిగి మరల ప్రధానిగా ఎన్నికై దేశాన్ని ఒక సక్రమమైన మార్గంలో ఉన్నత శిఖరాలలో దేశ ప్రజలందరూ ఆనంద ఉత్సవాలతో ఉండే విధంగా పరిపాలన చేస్తూ దేశాన్ని మరింత అభివృద్ధి మార్గంలో పయనించే విధంగా చేయాలని వేణుగోపాల స్వామి వారి ఆలయంలో అష్టోత్తర పూజ చేయించి స్వామి అనుగ్రహం మెండుగా కలగాలని పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్చార్జ్ గోలకోటి వెంకటరెడ్డి. ఉపాధ్యక్షులు గ్రంధి నానాజీ మండల అధ్యక్షులు మట్ట సూరిబాబు మండల సెక్రెటరీ సురేష్ కోట సత్య ప్రసాద్ సుంకర నాగేశ్వరరావు గ్రంధి నాని బాబు శివ వాసంశెట్టి సత్యనారాయణ కనకారావు తదితరులు పాల్గొన్నారు