నిరుపేద వధువుకు పుస్తె మట్టెలు పంపిణీ....

నిరుపేద వధువుకు పుస్తె మట్టెలు పంపిణీ....

 జనం న్యూస్ మెదక్ (జిల్లా ప్రతినిధి) మే 26: కౌడిపల్లి నూతన వధువు కు  దివంగత చిలుముల ఆశిరెడ్డి మెమోరియల్ ట్రస్టు ద్వారా మండల పరిధిలోని కౌడిపల్లి గ్రామానికి ద్వారం గళ్ళ సావిత్రి దుర్గయ్య కుమార్తె యశోద వివాహానికి పుస్తె మట్టెలు  శుక్రవారం అందజేశారు ఈ సందర్భంగా ట్రస్టు  చైర్మన్ , సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు చిలుముల వెంకటేశ్వర్ రెడ్డి  మాట్లాడుతూ గతంలో కూడా నిరుపేద కుటుంబాలకు పుస్తే మట్టెలు  పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. గ్రామంలో నిరుపేద కుటుంబాలు ఎవరైనా చనిపోతే వారికి చావు ఖర్చులకోసం నగదు అందించామన్నారు పెళ్లిళ్లకు బియ్యం నిరుపేద కుటుంబాలను ఆదుకోవడమే లక్ష్యంగా ట్రస్ట్ ముందుకు సాగుతుందని ఆయన అన్నారు. మండలంలోని గ్రామంలో అయినా పేద ప్రజల కు అవసరం నిమిత్తం కుటుంబాలను తమ వంతు సహాయంగా ట్రస్టు ద్వారా ఆదుకోవడమే తమ ముఖ్య లక్ష్యం అని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చంద్రం శ్రీనివాస్ గౌడ్ వార్డ్ మెంబర్ తిరుమలేష్ , ఎస్ఎంసి చైర్మన్ జగన్, వడ్డే ఎల్లయ్య తదితరులకు పాల్గొన్నారు