పగపట్టిన మృత్యువు.. ఊహించని సంఘటనతో క్షణాల్లో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి (వీడియో చూడండి)

జనం న్యూస్: మృత్యువు ఎప్పుడు, ఎవరిపై, ఎలా పగబడుతుందో ఎవరూ చెప్పలేరు. సంతోషంగా ఉన్న సమయాల్లో కొన్నిసార్లు సడన్‌గా షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. దీంతో అప్పటిదాకా సంతోషంగా ఉన్న చోట ఒక్కసారిగా విషాదం ఆవరిస్తుంటుంది. ఇలాంటి విషాద ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి ఊహించని విధంగా మృత్యువాత పడడం చూసి అంతా.. అయ్యో పాపం.. అంటున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ''మృత్యువు పగబట్టడం అంటే ఇదేనేమో''.. అంటూ కామెంట్లు చేస్తు్న్నారు. సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని మహోబా ప్రాంత పరిధి జసోదా నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక చందన్ గ్రామానికి చెందిన దేవేంద్ర (35) అనే యువకుడు.. తన బంధువు సువేంద్ర సింగ్ ఇంట్లో జరిగే మతపరమైన వేడుకలకు హాజరయ్యాడు. వేడుకల సందర్భంగా బంధువులంతా ఇంటి నుంచి ఆలయానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇంట్లో ఉన్న వారిలో కొందరు ప్రసాదాలు తయారు చేస్తుండగా.. మరికొందరు ఆలయం వద్ద పుణ్యస్నానాలు చేయడానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో దేవేంద్ర మరికొంత మంది బంధువులతో కలిసి బయటికి నుంచి పూజా సమాగ్రి తీసుకొచ్చారు. ఈ క్రమంలో దేవేంద్ర.. జెండా కర్ర కోసం ఓ పెద్ద వెదురుకర్రను పట్టుకుని వారితో పాటూ ఇంటికి వచ్చాడు. అంతా వరండాలోకి రాగానే దేవేంద్ర కూడా లోపలికి వచ్చాడు. అయితే ఆ ఇంటిపై ఉన్న హైటెన్షన్ వైర్లకు జెండా కర్ర తగులుకుని దేవేంద్రకు విద్యుత్ షాక్ తగిలింది. దీంతో అందరిముందూ ధబేల్‌మని కిందపడిపోయాడు. దేవేంద్రను చూసి అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. పరుగెత్తుకుంటూ వచ్చి దేవేంద్ర చేతులు, కాళ్లకు మసాజ్ చేశారు.తర్వాత చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇటీవల కురిసిసిన వర్షాలకు వెదురుకర్ర తడిసిపోయిందని, ఈ కారణంగానే విద్యుత్ షాక్ తగిలిందని తెలిసింది. ఇళ్లపై హైటెన్షన్ వైర్లు వెళ్తున్నా అధికారులు పట్టించకోలేదని దేవేంద్ర బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారులు స్పందించి ఉంటే.. తమ కొడుకు చనిపోయేవాడేకాదని మృతుడి తల్లిదండ్రులు బోరున విలపించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.