పల్లె దావఖానాలతో మెరుగైన వైద్యం.... ఎమ్మెల్యే పెద్ది

పల్లె దావఖానాలతో మెరుగైన వైద్యం.... ఎమ్మెల్యే పెద్ది

జనం న్యూస్ 25 మే నెక్కొండ :- పేద ప్రజలకు మెరుగైన వారికి అందుతుందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. గురువారం నెక్కొండ మండలంలో సూరిపల్లి గ్రామంలో పల్లె  దావఖానాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ మెరుగైన వైద్యం కోసం నియోజకవర్గ వ్యాప్తంగా 49 పల్లె దవఖానాలను నిర్మించడం జరిగిందన్నారు. పల్లె దవఖానాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ, మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీటీసీ, సర్పంచ్ డిప్యుటీ డిఎంహెచ్ఓ, వైద్య సిబ్బందితోపాటు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.