పెళ్లి చేసుకుంటానని నమ్మించి దళిత మహిళను మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

పెళ్లి చేసుకుంటానని నమ్మించి దళిత మహిళను మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

జనం న్యూస్ 23 నవంబర్
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్
దళిత మహిళను ప్రేమించి, వివాహం చేసుకోవడానికి నిరాకరించి, మోసం చేసిన వ్యక్తిని విజయనగరం డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు నవంబరు 22న అరెస్టు చేసినట్లుగా డిఎస్పీ తెలిపారు.విజయనగరం జిల్లా గంట్యాడ మండలం కిర్తిబర్తి గ్రామానికి చెందిన శినగం వెంకట సత్యం అను అతను ప్రస్తుతం బాపట్ల జిల్లా స్టువర్టుపురం వద్ద రైల్వే శాఖలో పాయింట్స్ మెన్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇతను గతంలో  SSS డిగ్రీ కళాశాలలో పని చేస్తున్నప్పుడు అదే కళాశాలలో ఫ్యాకల్టీగా పనిచేస్తున్న చంద్రంపేట గ్రామానికి చెందిన దళిత మహిళతో పరిచయం ఏర్పరచుకొని ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. తర్వాత వివాహం చేసుకుంటానని చెప్పి ఆమెను శారీరకంగా అనుభవించాడు. సదరు మహిళ వివాహం చేసుకోమని అడుగుగా కులం పేరుతో దూషించి, వివాహం చేసుకోవడానికి నిరాకరించినాడు. సదరు మహిళ ఇచ్చిన ఫిర్యాదు పై గంట్యాడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయగా, విజయనగరం సబ్ డివిజనల్ పోలీస్ అధికారి శ్రీ ఎం.శ్రీనివాసరావు గారు దర్యాప్తు చేపట్టారు. కేసు నమోదు చేసినప్పటి నుండి సదరు ముద్దాయి పరారీలో ఉండగా, డీఎస్పీ గారికి వచ్చిన సమాచారం మేరకు నిన్నటి దినం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచి, రిమాండ్ కి తరలించడమైనది.