ప్రథమ పూజిత 'శుభం గణేషం' ఆవిష్కరించిన                 ...సుప్రసిద్ధ చిత్రకారులు రుస్తుం

ప్రథమ పూజిత 'శుభం గణేషం' ఆవిష్కరించిన                 ...సుప్రసిద్ధ చిత్రకారులు రుస్తుం

జనం న్యూస్ :సిద్దిపేట నియోజిక వర్గ ఇంఛార్జి;వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని నేడు ఆదివారం స్థానిక రుస్తుం ఆర్ట్ గ్యాలరీలో "శుభం గణేషం" క్యాన్వాస్ చిత్రాన్ని అంతర్జాతీయ చిత్రకారులు రుస్తుం ఆవిష్కరించారు. మాట్లాడుతూ ముందుగా అందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, పండుగలు సంస్కృతి సంప్రదాయాలను కళావంతం చేస్తాయని, ముందు విజ్ఞేశ్వరుని పూజించి విగ్నాలను తొలగించుకొని శుభకార్యాలు ప్రారంభిస్తారు. సహృదయం తో నమ్ముకున్న భక్తులకు వినాయకచవితి అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తుందని ప్రగాఢ విశ్వాసం. ఆధ్యాత్మిక భక్తి ఐక్యత ను పెంపొందించి మానవ సంబంధాలను, సహజీవనాన్ని బాలోపేతం చేస్తుందన్నారు. విగ్నాలను తొలగించె విజ్ఞేశ్వరుడు గణేష్ నవరాత్రులు పూజలందుకొంటారు. నిస్సాయులకు దీనులకు సమస్త మానవాళికి ప్రపంచ నలుమూలల శాంతి సౌభాగ్యాలు సుఖ సంతోషాలు, ఐక్యమత్యంగా కలిసిమెలిసి పస్తులు లేకుండా జీవించే మనోధైర్యాన్ని ఆధ్యాత్మికం అంతర్భాగస్ఫూర్తిని అందజేస్తుందన్నారు. అదేస్పూర్తితో ముఖ్యమంత్రి కేసీఆర్ బంగారు తెలంగాణ సహజీవనం, జలవనరులు పాడిపంటలతో ఆసరా భరోసా రైతుబంధు దీనబందు తో విశ్వానికి మార్గదర్శనం చేస్తూ అనైక్యత నిరుద్యోగం అధిగ మించాలన్నారు. వినాయకచవితితో సబ్బండ వర్గాల బతుకుల్లో ఆనందాలు వెల్లివిరియాలని, మానవతా చిత్రకారులు రుస్తుం ఆకాక్షించారు.ఆర్ ఎ ఎఫ్ అధ్యక్షురాలు జులేఖరుస్తుం నైరూప్య చిత్రకారుడు నహీంరుస్తుం, రూబినారుస్తుం అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రైట్, మహ్మద్ సాధిక్, ఎండి రహీమ్,  తదితరులు పాల్గొని అందరికి వినాయక చవితి కలర్ఫుల్ శుభాకాంక్షలు తెలియజేశారు.