ప్రైవేట్ స్కూలుకు దీటుగా గవర్నమెంట్ స్కూల్ ఉండాలి - కాండ్రేగుల నూకరాజు

ప్రైవేట్ స్కూలుకు దీటుగా గవర్నమెంట్ స్కూల్ ఉండాలి - కాండ్రేగుల నూకరాజు

జనం న్యూస్ మే 26 (అనకాపల్లి జిల్లా)ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  ప్రభుత్వం మొదటి ప్రాధాన్యం విద్యకు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలను నాడు నేడు కార్యక్రమంలో ప్రైవేట్ స్కూలు దీటుగా గవర్నమెంట్ స్కూల్ ఉండాలని ఉద్దేశంతో నాడు నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ స్కూల్లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది.దాన్ని ఉద్దేశించి మునగపాక మండలం  వాడ్రాపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ అయిన కాండ్రేగుల నూకరాజు,  సచివాలయం సిబ్బంది, వాలంటరీలు అందరూ కలిసి పిల్లలందరూ మెరుగైన విద్యను పొందాలంటే గవర్నమెంట్ స్కూలులో జాయిన్ చేయాలని ఇంటింటికి వెళ్లి తల్లితండ్రులను కోరడం జరిగింది . అదేవిధంగా నూకరాజు మాట్లాడుతూ గవర్నమెంట్ స్కూల్లో  విద్య చాలా బాగుందని నాడు నేడు కార్యక్రమంలో చాలా అభివృద్ధి  జరిగిందని అలాగే ప్రైవేట్ స్కూలు దీటుగా ఇంగ్లీష్ మీడియం కూడా పెట్టడం జరిగిందని ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్క విద్యార్థి, విద్యార్థిని, తల్లిదండ్రులు వినియోగించుకోవాలని వాడ్రాపల్లి గ్రామ సర్పంచ్ అయిన కాండ్రేగుల నూకరాజు తెలిపారు .//