బిడ్డ కోసం మానాన్ని వదులుకున్న తల్లి.. కదిలే రైలులో ఒక తల్లిపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం.

జనం న్యూస్: నడి రోడ్డుపై తాగేసి తన మానాన తాను ఇంటికి వెళుతున్న మహిళపై దాడి చేయడమే కాకుండా వివస్త్రను చేసి పైశాచికం ఆనందం పొందేవాడు ఒకడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధులపై, చిన్నారులపై అత్యాచారానికి ఒడిగట్టే కామాంధుడు మరొకరు. బహిర్భూమికి వెళ్లినా, పొలంలో పనులు చేసుకుంటున్న మహిళలపై అఘాయిత్యాలకు తెగబడుతున్న కామ పిశాచాలు కొందరు. పని ప్రదేశాల్లో మహిళల పట్ల వెకిలి చేష్టలు చేసేవారు మరికొందరు. సమాజం ఎటు పోతుందో ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితులకు దారి తీస్తున్న కారణాలేంటీ? ఆడదానిగా పుట్టడమే ఆమె చేసిన పాపమా,శాపమా? పసిగొడ్డు దగ్గర నుండి కాటికి కాలు చాపే వృద్ధురాలి వరకు కామోన్మాదులు బరితెగింపు చర్యలకు దిగుతున్నారు. జనాలు చూస్తున్నారన్న ఆలోచన కూడా లేదు నిస్సిగ్గుగా తప్పులు చేస్తున్నారు. తాజాగా యావత్ దేశం తలదించుకునే సంఘటన తాజాగా చోటుచేసుకుంది. కదులుతున్న రైలులోనే అత్యాచారానికి ఒడిగట్టారు ఇద్దరు దుర్మార్గులు. ఈ ఘటన అస్సాం నుండి పశ్చిమ బెంగాల్ వెళుతున్న సిఫాంగ్ రైల్లో జరిగింది. వివరాల్లోకి వెళితే..గౌహతికి చెందిన మహిళ తన కుమారుడితో కలిసి బెంగాల్‌లోని అలీపూర్‌ద్దార్ వెళ్లేందుకు సిఫాంగ్ ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కింది. రైలు ఫకీరాగ్రామ్ చేరుకునే దాదాపు అందరూ దిగిపోయారు ఈ క్రమంలో ఆ బోగీలో ఒంటరిగా ఉండిపోయింది మహిళ. ఇదే అదునుగా భావించిన ఇద్దరు వ్యక్తులు.. బాధితురాలిపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఆమె దగ్గరకు వెళ్లి.. మహిళను గట్టిగా పట్టుకుని కట్టేశారు. ఆపై దాడి చేశారు. బిడ్డను తీసుకుని తమకు సహకరించాలని లేకుంటే బాబును పడేస్తామంటూ బెదిరించారు. దీంతో ఆమె తలొంచాల్సి వచ్చింది. ఆ తర్వాత అత్యాచారానికి పాల్పడ్డారు. రైతు గమ్యస్థానానికి చేరుకోగానే.. బాధితురాలు రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేసింది. జరిగిన మొత్తాన్ని వివరించింది. రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుల్ని పట్టుకున్నారు. అస్సాంకు చెందిన అబ్దు, మొయినుల్ హక్ ఈ ఘాతుకానికి తెగబడినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల్ని కోర్టులో హాజరు పరిచారు. గతంలో కూడా ఓ రైల్వే టీటీ.. కదులుతున్న రైలులో మహిళా ప్రయాణీకురాలిపై అత్యాచారానికి తెగబడిన సంగతి విదితమే.