భర్తకు ప్రియుడితో అడ్డంగా దొరికిపోయింది.. ప్రియున్ని ఎక్కడ దాచిందో చూస్తే బిత్తరపోతారు..

జనం న్యూస్: ప్రస్తుతం సమాజంలో భర్తకు తెలియకుండా భార్య భార్య తెలియకుండా భర్త చేసే పనులు వారి కాపరాల్లో చిచ్చు పెడుతున్నాయి. ఈ విషయం చాలామంది దంపతులకు తెలిసిన కూడా తప్పుల మీద తప్పులు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా వివాహేతర సంబంధాల విషయంలో ఎక్కువ సమస్యలు వస్తూ ఉంటాయి. ప్రియురాలతో ఉండగా భార్యకి దొరికిపోయిన భర్తలు, ప్రియుడుతో ఉండగా భర్తకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతున్న భార్యల కేసులను తరచుగానే చూస్తూ ఉన్నాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన ఫోటోలు,వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి తెగ హల్చల్ అవుతుంది. ప్రియుడుతో ఏకాంతంగా ఉన్న సమయంలో భర్త సడన్ గా ఇంట్లోకి వచ్చాడు. దీంతో ఆమె తన ప్రియుడిని ఎక్కడ దాచాలో తెలియక కూలర్ లో దాచింది. ఈ ఘటన రాజస్థాన్ లో జరిగినట్లుగా తెలుస్తుంది. మహిళ తన భర్తకు తెలియకుండా వేరే వ్యక్తితో వివేక వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త లేని సమయంలో ప్రియుడు వారి ఇంటికి వస్తూ వెళ్తూ ఉండేవాడు. ఈ క్రమంలో ఇటీవల ఓ రోజు భర్త లేని సమయం చూసి రాత్రివేళ అతను తన ప్రియురాలు ఇంటికి వెళ్ళాడు. ఇద్దరు ఏకాంతంగా ఉన్న సమయంలో భర్త కుటుంబ సభ్యులు ఇంట్లోకి వచ్చారు. వారు వచ్చే ముందు అలెర్ట్ అయిన ఆమె తన ప్రియుడిని కూలర్ లో దాచింది. అప్పటికే భార్యపై అనుమానంతో ఉన్న భర్త ఇంట్లోకి రాగానే మొత్తం వెతికాడు. ఇలా చివరికి కూలర్ కు వెనుక వైపు తిప్పి చూడగా అందులో వ్యక్తి దాక్కుని ఉండడం కనిపించింది. దీంతో అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా ఖంగుతున్నారు. భర్తకు దొరికిపోవడంతో భార్యా తెల్ల మొహం వేసింది. అప్పటికి తన తప్పేమీ లేనట్లుగా ప్రవర్తించింది. ఈ ఘటనను మొత్తం వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపైన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందించారు.