మంచం కింద చేతబడి..! నిద్రలోనే మనిషి మాయం.. అంతుచిక్కని మిస్టరీ.. తప్పక తెలుసుకోండి.

జనం న్యూస్: మంత్రాలకి చింతకాయలు రాలవు అంటారు. కానీ.., ఇప్పుడు ఓ ఊరిలో మాత్రం మంత్రాలకి మనుషులు మాయం అవుతున్నారు. ముగ్గు, నిమ్మకాయలు, మిరపకాయలతో మనుషులను మాయం చేస్తున్నారు. వినడానికి ఇది కాస్త ఆశ్చర్యంగా అనిపిస్తున్నా నిజంగా నిజం. వరంగల్ జిల్లాలోని చెన్నారావు పేట మండలం ఉప్పర్ పల్లి గ్రామంలో ఇలాంటి వింత ఘటనలే చోటు చేసుకుంటున్నాయి. ఈ గ్రామంలో చేతబడితో వరుసగా మనుసులు మాయం అవుతుండటం అందరిని షాక్ కి గురి చేస్తోంది. ఆ వివరాల్లోకి వెళ్తే.., ఉప్పర్ పల్లి గ్రామంలో చీమల సతీశ్ అనే వ్యక్తి నివశిస్తున్నాడు. చల్లటి గాలి వీస్తుండటంతో.., సతీశ్ ఆ రాత్రి ఆరు బయట నిద్రపోయాడు. కానీ.., తెల్లారేసరికల్లా సతీశ్ మాయం అయిపోయాడు. అతని నిద్రించిన మంచం పక్కన చేతబడి చేసిన ఆనవాళ్లు కనిపించాయి. మనిషి బొమ్మ, ముగ్గు వేసి అందులో పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, మిరపకాయలు, బొగ్గు వేసి చేతబడి చేసినట్టుగా ఉంది. పైగా.., సతీష్ ఫోన్ మంచం మీదే ఉన్నా.., అతని బైక్ మాతం కనిపించడం లేదు. సతీశ్ తనకి తానుగా ఎక్కడికైనా వెళ్ళిపోతే సెల్ ఫోన్ ఎందుకు వదిలి వెళ్తాడు? పైగా.. అతని మంచం వద్ద ఈ చేతబడి గుర్తులు ఏంటని గ్రామస్థులు భయాందోళనలోకి గురి అవుతున్నారు. నిజానికి ఉప్పర్ పల్లి గ్రామంలో ఇలా చేతబడికి మనుషులు మాయం అవ్వడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఓ వ్యక్తి ఇలానే మాయం అయిపోయాడు . అతని మంచం కింద ఇలాంటి చేతబడి గుర్తులే కనిపించాయి. పోలీసులు ఆ యువకుడి ఆచూకీ ఇప్పటి వరకు కనిపెట్టలేకపోయారు. సతీష్కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. చేతబడి చేసి సతీష్ను ఏం చేశారోనని బంధువులు రోధిస్తున్నారు. ఇప్పటికే రంగంలోకి దిగిన పోలీసులకు అక్కడ పరిస్థితి చూసి పిచ్చిపట్టినట్టు అయ్యింది. ఎలాంటి ఆధారాలు లభ్యం కావడం లేదు. కానీ.., మనుషులు మాత్రం మాయం అవుతూ వస్తున్నారు. దీంతో.., జిల్లా పోలీసులు ఈ సంఘటనని సీరియస్ గా తీసుకున్నారు. ఇదే సమయంలో చేతబడిలు వంటివి లేవని, ప్రజలు ఈ విషయంలో భయపడాల్సిన పని లేదని జిల్లా అధికారులు ప్రజల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. కానీ.., ఉప్పర్ పల్లి గ్రామస్థులు మాత్రం ఎప్పుడు, ఎవరు మాయం అవుతారోనన్న భయంతో అసలు బయటకి రావడానికే జంకుతున్నారు. మరి.., ఇంతలా మనుషులను మాయం చేసే రేంజ్ లో చేతబడిలు ఉన్నాయి అంటారా?