మల్టీపర్పస్ పార్క్ పనులను పరిశీలించిన మేయర్ సునీల్ రావు

మల్టీపర్పస్ పార్క్ పనులను పరిశీలించిన మేయర్ సునీల్ రావు

     జనం న్యూస్ కరీంనగర్ జనవరి 21: కరీంనగర్ స్మార్ట్ సిటీ అభివృద్ధిలో భాగంగా నగరంలోని మల్టీపర్పస్ పార్కును శనివారం సిటీ మేయర్ యాదగిరి సునీల్ రావు సందర్శించి జరుగుతున్న పనులను తనిఖీ చేసి పరిశీలించించారు. మార్చి మాసంలోగా పార్కు పనులను పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని కాంట్రాక్టర్ తో పాటు ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ ఎస్. ఈ నాగమలేశ్వరరావు, ఈఈ కిష్టప్ప, బిఆర్ఎస్నాయకుడు కాసెట్టి శ్రీనివాస్, మున్సిపల్ &స్మార్ట్ సిటిఏజెన్సీ అధికారులు పాల్గొన్నారు.