మాగి చక్కెర కర్ణగానికి చైర్మన్గా ఎండి షాదుల్ సాబ్,నియామకం

మాగి చక్కెర కర్ణగానికి చైర్మన్గా ఎండి షాదుల్ సాబ్,నియామకం

జనం న్యూస్ కంగ్టి జులై 10

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని జంమ్గి బి,గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎండి షాదుల్ సాబ్,ను రాష్ట్ర చక్కెర కర్మాగార   కమిషనర్,మంగళవారం మాగీ చక్కెర కర్మాగారనికి సిడిసి చైర్మన్గా ఎంపిక చేసినట్లు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా సిడిసి చైర్మన్ షాదుల్ సబ్ మాట్లాడుతూ సంగారెడ్డి, కామారెడ్డి,మెదక్, జిల్లాల ప్రజలకు ఉపయోగకరంగా ఉన్న చక్కెర కర్మాగారనికి చైర్మన్గా నియమించిన కాంగ్రెస్ పార్టీ,రాష్ట్ర ఐటి అండ్ భారీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు,  జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్. నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి,  జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, డిసీసీ జనరల్ సెక్రెటరీ పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్లోళ్ల సుధాకర్ రెడ్డి,ని నూతనంగా ఏర్పాటు అయిన చైర్మన్, పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలను తెలిపారు.
షుగర్ ఫ్యాక్టరీ అభివృద్ధికై,రైతుల అభివృద్ధికై తన వంతుగా ప్రతి విషయంలోనూ   శాయశక్తుల కృషి చేస్తూ కర్మాగార అభివృద్ధి దిశలో నడిపేందుకు కృషి చేస్తానని అన్నారు.