రేయ్ ఏంట్రా ఇది..! అసలు ఎవరు రా మీరంతా.. ఇలా ఉన్నారెంట్రా.. (వీడియో చూడండి)
జనం న్యూస్: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల ఫన్నీ వీడియోలు దర్శనమిస్తుంటాయి. ఇందులో కొన్ని అనుకోకుండా జరిగితే మరికొన్ని ఫన్ క్రియేట్ చేయడానికి వీడియోలు తీసి షేర్ చేస్తుంటారు. కొందరికి తెలియకుండా వీడియో తీసి వాళ్లు చేసే పనిని చూపిస్తూ ఫన్ జనరేట్ చేస్తుంటారు. మరికొన్ని వీడియో చూస్తే ఇదంతా నిజమేనా అనిపిస్తుంది. అలాగే కొందరు రీల్స్ చేసే క్రమంలో కిందపడిపోయి.. లేదా సరిగా చేయలేక కామెడీ చేసిన వీడియోలు కూడా అలాగే షేర్ చేస్తుంటారు. ఇవి కూడా నెటిజన్లను నవ్విస్తుంటాయి. ఈ మధ్య ఫ్రాంక్ లపేరుతో చేసే వీడియోలు చూస్తూ ఏది నిజమో ఏది ఫ్రాంక్ తెలియక కన్ఫ్యూజ్ అవతుంటారు. అలాగే నెట్టింట్లో సందడి చేసే వీడియోలు కొన్ని భయపెట్టిస్తే మరికొన్ని కడుపుబ్బ నవ్విస్తాయి. ఇతరులు చేసే పనిని వారికి తెలియకుండా వీడియో తీసి ఆ ఫన్నీ మూమెంట్ ని షేర్ చేస్తూ నెటిజన్లతో పంచుకుంటారు. అలాగే కొన్ని మానవత్వం కదిలించే వీడియోలు కూడా దర్శనమిస్తుంటాయి. ముఖ్యంగా జంతువుల వీడియోలు అవి చేసే అల్లరి తెగ వైరల్ అవుతుంటాయి. అలాగే కొంతమంది ఫుడ్ లవర్స్ కూడా వారు తినే విధానం.. పక్కన ఏం జరుగుతున్నా పట్టించుకోకుండా లాగించేయడం వంటి వీడియోలు నవ్విస్తాయి. ప్రస్తుతం అలాంటి వీడియోనే నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఓ ఫంక్షన్ లో జరిగిన ఫన్నీ సంఘటన ఇప్పుడు అందరినీ నవ్విస్తోంది. ఫంక్షన్ లో అందరూ బోజనం చేస్తుండగా సడెన్ గా వర్షం పడింది. దీంతో అందరూ పరుగుతీశారు. కానీ కొంతమంది యువకులు మాత్రం వర్షంలో కుర్చీలను తలపై అడ్డుగా పెట్టుకుని అలాగే భోజనం చేశారు. దీంతో అక్కడున్న వారు వీడియో తీసి సోసల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తూ ఏంట్రా.. ఇది అంటూ నవ్వుకుంటున్నారు.