రైతులకు అందు బాటులో జనుము,జిలుగు విత్తనాలు

రైతులకు అందు బాటులో జనుము,జిలుగు విత్తనాలు

యామపుర్ సహకార సంఘం చైర్మన్ అంకతి రాజన్న

 జనం న్యూస్ ప్రతినిధి బోడ దివాకర్ మే 26 : రైతులకు అందు బాటులో జనుము,జిలుగు విత్తనాలు సిద్దం చేసినట్లు జగిత్యాల జిల్లా ఇబ్రహింపట్నం మండలం యామపుర్ సహకారసంఘం చైర్మన్ అంకతి రాజన్న అన్నారు. ఈసందర్భంగా సహకారసంఘం లో శుక్రవారం జనుము, జిలుగు విత్తనాలు పంపిణి చేశారు. అనంతరం చైర్మన్ రాజన్న మాట్లాడుతూ 30 కిలోల జిలుగు విత్తనాలు రూ. 2,408 విలువగలది, రైతులకు సబ్సిడీ పైన రూ. 843 లకు వస్తుందని, 40 కిలోల జనుము విత్తనాలు రూ. 3,500 విలువగలది సబ్సిడీ పైన రూ.1225 లకే వస్తుందని ఇట్టి అవకాశం సహకారసంఘం పరిదిలోని రైతులు వినియెగీంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తలరి అనంద్, బోరిగాం మహేష్, విండో డైరెక్టర్ కనుక నాగేష్, రైతులు క్యాతం తిరుపతి, సిఇఓ నేమురి మహేంధర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.