రైలులో మూతి ముద్దులతో రెచ్చిపోయిన ప్రేమజంట.. చిర్రేత్తిపోయి వారి తిక్క కుదిర్చిన మహిళ..

జనం న్యూస్: ఢిల్లీ మెట్రో.. ఈ పేరు వినగానే అందరికీ మంచి వినోదభరిత ప్రయాణం అని గుర్తుకు వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే.. ఢిల్లీ మెట్రో బిగ్‌బాస్‌ హౌజ్‌ను మించిపోయిన ఎంటర్‌టైన్మెంట్‌ ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే..ఢిల్లీ మెట్రోలో రకరకాల ఇన్సిడెంట్లు జరుగుతుంటాయి. మెట్రోలో ప్రయాణికులు తరచూ తమ టాలెంట్‌ను ప్రదర్శిస్తుంటారు. కొందరు డ్యాన్స్‌లు చేస్తూ.. మరికొందరు పాటలు పాడుతూ రిల్స్‌ చేస్తుంటారు. మరికొన్ని సందర్భాల్లో గొడవలు, ఘర్షణలు, తీవ్ర వాదనలు చూస్తుంటాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రేమికులు చేసే చిలిపి పనులు, చిరాకు పనులు కూడా కనిపిస్తుంటాయి. అయితే, తాజాగా మరోమారు ఢిల్లీ మెట్రోకు సంబందించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇందులో ఇద్దరు ప్రేమికులు చేసిన పనితో చిర్రెత్తిపోయిన ఓ మహిళ వారికి ఎలా గుణపాఠం నేర్పిందో చూడొచ్చు.. వైరల్‌ అవుతున్న వీడియోలో ఢిల్లీ మెట్రో రైలు కిక్కిరిసిన ప్రయాణికులతో కనిపిస్తుంది. అయితే, ఇంత రద్దీలో ఇద్దరు యువతీ యువకులు అసభ్యంగా ప్రవర్తించారంటూ ఓ మహిళ వారిని కడిగిపరేసింది. ప్రజా రవాణాలో ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నారంటూ వారిపై ఆ మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ ఇద్దరితో మహిళ కోపంగా మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతోంది. బహిరంగ ప్రదేశంలో బాలిక, ఆమె ప్రియుడు చేసిన చర్యను ప్రశ్నించిన మహిళకు ఒక వర్గం మద్దతుగా రావడం, ఇతరులు వారిని వ్యతిరేకించడంతో వాదన తీవ్రమైంది. వివాదానికి సంబంధించిన వీడియోను ట్విట్టర్ (ఎక్స్)లో పోస్ట్ చేయగా, విపరీతంగా వైరల్‌ అవుతోంది. మెట్రో రైల్లో ఇద్దరు ప్రేమికులు బహిరంగంగా తమ ప్రేమను ప్రదర్శించడం వల్ల ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతోందని, అలాంటి ప్రవర్తనను సహించబోమని ఆ వీడియోలో ఆగ్రహంతో చెప్పింది. ఇలాంటి పనులు మెట్రో బయట ప్రైవేట్ ప్లేస్ లో చేయాలని కూడా సలహా ఇస్తున్నారు. సన్నిహితంగా ఉండటం, చేతులు పట్టుకోవడం, చెంపలు తాకడం వల్ల ఎదుటికి అసహ్యం వేస్తుందని మండిపడ్డారు. మీకు సిగ్గు లేదా అని కూడా వారిని నిలదీసింది.దాంతో ఆ ఇద్దరు విచారిస్తూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. మనం ఏం చేశాం అంటూ ఆ యువకుడు ఎడ్డిముఖం పెట్టడం కూడా వీడియోలో కనిపించింది. ఇకపోతే, సోషల్ మీడియాలో వీడియో వైరల్‌ కావటంతో నెటిజన్లు విపరీతంగా స్పందించారు. ఇలాంటి మహిళలు ఉండాలంటూ ఒక వర్గం ట్విట్టర్‌లో (X) ట్విట్‌ చేస్తుండగా, మరొక వర్గం ఇలాంటి ప్రవర్తనకు కొన్ని పరిమితులు ఉన్నాయని, ప్రతి ఒక్కరూ గౌరవించబడాలని అన్నారు.