వామ్మో ఇదేం విచిత్రం.. టీవీ చూస్తూ అస్థిపంజరంలా మారిపోయిన మహిళ. ఇదో పెద్ద మిస్టరీ..?

వామ్మో ఇదేం విచిత్రం.. టీవీ చూస్తూ అస్థిపంజరంలా మారిపోయిన మహిళ. ఇదో పెద్ద మిస్టరీ..?

జనం న్యూస్: పుట్టిన ప్రతి మనిషి మరణిస్తాడు.. అలానే జీవం ఉన్న ప్రతిది నశిస్తుంది. ఇక ఆత్మ, పునర్జన్మ ఇలాంటి వాటి మీద బోలెడన్ని వాదనలు. ఇప్పుడు మనం ఆ టాపిక్‌ మీదకు వెళ్లడం లేదు కానీ.. కొన్ని చావులు మాత్రం చరిత్రలో మిస్టరీగా మిగిలిపోతాయి. వారు ఎందుకు, ఏ కారణం చేత చనిపోయారు వంటి కారణాలు మాత్రం తెలియవు. ఏళ్లు గడుస్తున్న కొద్ది అవి అంతు చిక్కని మిస్టరీలుగా మారుతాయి. ఈ కోవకు చెందిన ఓ డెత్‌ మిస్టరీ గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఓ మహిళ.. కుర్చీలో కూర్చుని టీవీ చూస్తూ ఉంటుంది. అలా కూర్చున్న మనిషి కూర్చన్నట్లే మృతి చెందింది. దాదాపు మూడేళ్ల తర్వాత ఆమె మరణించినట్లు వెలుగులోకి వచ్చింది. ఆమె ఇంటి లోపలికి వెళ్లిన పోలీసులకు.. అక్కడి దృశ్యం చూసి గుండెలు జారిపోయాయి. ఎదురుగా కుర్చీలో అస్థిపంజరం వారికి దర్శనం ఇచ్చింది. మరో షాకింగ్‌ న్యూస్‌ ఏంటంటే.. ఆ ఇంట్లో టీవీ ఇంకా మోగుతూనే ఉంది. ఈ సంఘటన అప్పట్లో పెను సంచలనంగా మారింది. కానీ సదరు మహిళ మృతికి గల కారణాలు నేటికి కూడా బయటపడలేదు. ఆ వివరాలు.. ఈ ఆశ్చర్యకరమైన సంఘటన లండన్‌లో చోటు చేసుకుంది. జాయిస్‌ విన్సెంట్‌ అనే మహిళ ఇలా విచిత్రమైన రీతిలో మృతి చెందింది. ఆ వివరాలు..

జాయిస్‌ విన్సింట్‌ 1965, అక్టోబర్‌ 19ప లండన్‌లో జన్మించింది. ఆమె కుటుంబ సభ్యులు వివరాలు ఏమి తెలియవు. ఎందుకంటే.. చనిపోవడానికి రెండేళ్ల ముందు అనగా.. 2001 నుంచి ఆమె తన సన్నిహితులతో కాంటాక్ట్స్‌ తెంచుకుంది. ఉద్యోగానికి రాజీనామా కూడా చేసింది. గృహహింస బాధితుల కోసం నిర్మించిన ఆశ్రమంలో చేరింది. అయినవారు అందరికీ దూరంగా ఉండటం ప్రారంభించింది. ఈ క్రమంలో 2006, జనవరి 25న ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. విన్సెంట్‌ నివాసంలో కనిపించిన దృశ్యం చూసి వారు భయంతో బిగుసుకుపోయారు. ఎందుకుంటే.. ఆమె చనిపోయి అప్పటికే సుమారు మూడు సంవత్సరాలు కావొస్తోంది. ఇక విన్సెంట్‌.. చేతిలో రిమోట్‌ పట్టుకుని.. కుర్చీలో కూర్చుని టీవీ చూస్తూ అలానే మృతి చెందింది. కూర్చిలో విన్సెంట్‌ అస్థిపంజరం వారికి దర్శనం ఇచ్చింది. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే.. విన్సెంట్‌ గదిలో టీవీ నడుస్తూనే ఉంది. ఇక ఆ అస్థిపంజరం విన్సెంట్‌దేనని ఆమె దంతాలను పరీక్షించడం ద్వారా తెలిసింది. అయితే విన్సెంట్‌ మృతికి గల కారణాలు మాత్రం తెలియలేదు. ఇప్పటికి ఆమె మరణం అంతు చిక్కని రహస్యంగానే మిగిలిపోయింది.