వాలంటీర్లు పై పవన కళ్యాణ్ గారు, డోలా వీరాంజనేయ గారు చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి
ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ డిమాండ్*
జనం న్యూస్ 23 నవంబర్
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్
రాష్ట్రంలో టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వలంటిర్లను తొలగించము అని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉగాది రోజున శుభవార్త చెబుతాం అని చెప్పిన మాట మరిచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనేయ గారు వాలంటీర్ వ్యవస్థే లేదు అని అసెంబ్లీ లో చెప్పడమంటే మీలో మీకు పొంతన లేని ప్రకటనలు చేసి వాలంటీర్ల మనోభావాలతో ఆడుకుంటున్నారా అని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ ధ్వజమెత్తారు.వాలంటీర్ వ్యవస్థే లేదు అని పవన కళ్యాణ్ గారు, డోలా వీరాంజనేయ గారు చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి అని విజయనగరంలో ఎ.పి గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్స్ యూనియన్ ( ఏఐటీయూసీ అనుబంధం ) అధర్యంలో వాలంటీర్లు అందరూ కలిసి కోట జంక్షన్ నుంచి గంట స్థంభం దగ్గర మానవహారం నిర్వహించి ముఖ్యమంత్రి గారూ వాలంటీర్లుకి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అని నినాదాలు చేశారు.ఈ సందర్భంగా బుగత అశోక్ మీడియాలో మాట్లాడుతూ వాలంటీర్ వ్యవస్థే లేదు అని పచ్చి అబద్ధాలు చెబుతున్న మంత్రులు మీరు అధికారంలోకి వచ్చాక ఇచ్చిన వేతనంలో 200 రూపాయిలు పేపర్ బిల్లు అని చెప్పి ఎందుకు కటింగ్ చేశారు, రాజీనామా చేసిన వాలంటీర్లు కోసం ఎందుకు కోర్టుకి వెళ్ళారు, వాలంటీర్లు కోసం మీ సాంఘిక సంక్షేమ శాఖ లో ఎందుకు మంత్రిగా కొనసాగుతున్నారు, జూన్, జూలై నెలలో వాలంటీర్లును కొనసాగిస్తాం వాళ్ళని వివిధ ప్రభుత్వ శాఖల్లో పని విభజన చేస్తాం అని ఎందుకు మాటలు చెప్పారు మంత్రి గారు అని ప్రశ్నించారు. అంటే మీ అధికారం కోసం వాలంటీర్లు మనోభావాలతో ఆడుకోవడం సమంజసం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019 లో సచివాలయ వ్యవస్థ కంటే ముందుగానే వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతి యువకులను వాలంటీర్లుగా నియమించి వారు ప్రభుత్వ సంక్షేమ పథకాలను, కార్యక్రమాలను ప్రజల వద్దకు చేరవేడయంలో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారదిగా సేవలు చేయడం జరిగిందనీ అందరికీ తెలిసిన విషయమే అని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తె వాలంటీర్లను కొనసాగిస్తాం అని ఇచ్చిన హామీ ఇప్పటి వరకు అమలు చేయకపోవడం వలన వాలంటీర్లు ఆవేదన చెందుతున్నారు అని అన్నారు. రాష్ట్రంలో 2 లక్షల అరవై వేల మంది వాలంటీర్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు వాలంటీర్లు అందరికీ న్యాయం చేస్తారని ఎన్నో ఆశలు పెట్టుకుని ఎన్ని రాజకీయ ఒత్తిళ్ళకి గురి చేసిన కూటమి ప్రభుత్వం గెలుపుకోసం వారి వంతుగా కృషి చేసిన వాలంటీర్ల ఆశల్లో నీళ్ళు చల్లకుండ వారి ఆవేదన అర్థం చేసుకుని ఉద్యోగాల్లో కొనసాగించాలన్నారు. 6 నెలలుగా ప్రభుత్వం నుండి గౌరవ వేతనం కూడా చెల్లించకపోతే ఎందరో మహిళలు ఆ గౌరవ వేతనం మీదే కుటుంబంలో కొంత ఆర్థక ఇబ్బందులను నెట్టుకొస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు వాలంటీర్స్ అందరికి న్యాయం చేస్తామని నెలకు పదివేల రూపాయలు గౌరవ వేతనం పెంచి ఇస్తామని వాలంటీర్లు అందరికి సమాజంలో మంచి గుర్తింపు గౌరవం వుండే పద్ధతిలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని మరిచిపోవద్దు అని గుర్తు చేశారు. అలాగే ఎన్నికల సమయంలో గత ప్రభుత్వ రాజకీయ నాయకులు ఒత్తిడి చేసి బలవంతపు రాజీనామాలు చేయించడం వల్ల చాలా మంది వాలంటీర్స్ ఒత్తిళ్ళకి తట్టుకోలేక బలవంతంగా రాజీనామాలు చేసారనీ అన్నారు. ఏఐటీయూసి జిల్లా అధ్యక్షులు ఎస్.రంగరాజు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని మరచిపోకుండా వాలంటీర్స్ అందరికి ఉద్యోగ భద్రత కల్పించాలని, గౌరవ వేతనం పదివేల రూపాయలు ఇప్పించాలని, గత 6 నెలలుగా బకాయి ఉన్న గౌరవ వేతనాన్ని విడుదల చేయించాలని, రాజకీయ ఒత్తిళ్లుతో రాజీనామా చేసిన వాలంటీర్లను మన్నించి తిరిగి విదుల్లో కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఉన్నత చదువులు చదువుకొని ప్రభుత్వానికి సేవ చేయాలి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతో వాలంటీర్ ఉద్యోగాల్లో చేరిన వాలంటీర్ అందరి భవిష్యత్తుకు భరోసా కల్పించమని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని అన్నారు. వాలంటీర్లుకి న్యాయం జరగకపోతే ఏఐటీయూసీ వాలంటీర్లకు అండగా నిలబడి వాళ్ళకి న్యాయం జరిగే వరకూ దశల వారీ పోరాటాలకు కార్యాచరణతో వెళ్ళక తప్పదనీ హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లా వ్యాపితంగా వార్డు, గ్రామ సచివాలయల వాలంటీర్లు పాల్గొన్నారు.