విజయనగరం యూత్ పౌండేషన్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

జనం న్యూస్, సెప్టెంబర్ 18విజయనగరంవినాయక చవితి సందర్భంగా ఆదివారం స్థానిక కోట జంక్షన్ వద్ద విజయనగరం యూత్ పౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా 1000 మట్టి వినాయక ప్రతిమలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతీ ఒక్కరు మట్టి విగ్రహాలనే పూజించాలని, చెరువులు, ప్రకృతిని కాపాడుకోవడం మన బాధ్యత ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు పర్యావరణాన్ని ఎక్కువగా హానికరమని పేర్కొన్నారు. పర్యావరణ హితాన్ని కోరుకునే ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలనే పూజించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ లోవరాజు పాల్గొన్నారు ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుని పూజించాలని కోరారు. విజయనగరం యూత్ పౌండేషన్ చేస్తున్న సేవలను కొనియాడారు విజయనగరం యూత్ అధ్యక్షులు షేక్.ఇల్తామాష్ మాట్లాడుతూ,రసాయన రంగులతో తయారు చేసిన వినాయక విగ్రహాలను పూజించి చెరువుల్లో నిమజ్జనం చేయడం వల్ల చెరువు నీరు కలుషితమవుతుందని అందులో నివసించే జీవరాసుల మనుగడకు ముప్పు వాటిళ్లుతుందన్నారు. తెలిపారు విజయనగరం యూత్ ఫౌండేషన్ సభ్యులు అశోక్, సాయి, రాయల్ క్యాబ్స్ శరత్, , రాము, రఘు, విజయ్, కొక్కిరి కిరణ్, సన్నీ, కళ్యాణ్ , విజయ బ్లడ్ బ్యాంక్ మేనేజర్ పుణ్యమంతుల శివ, తదితరులు పాల్గొన్నారు.