సత్తుపల్లి ఆర్టీసీ సేవలు అభినందనీయం.. రూరల్ సీఐ వెంకటేష్

సత్తుపల్లి ఆర్టీసీ సేవలు అభినందనీయం.. రూరల్ సీఐ వెంకటేష్

దాతలకు కృతజ్ఞతలు తెలిపిన సత్తుపల్లి డిపో మేనేజర్ రాజ్యలక్ష్మి

జనం న్యూస్ టుడే : కల్లూరు.

     ప్రయాణికులకు సత్తుపల్లి డిపో మేనేజర్ యు రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో సిబ్బంది  అందిస్తున్న సేవలు సేవలు అభినందనీయమని సత్తుపల్లి రూరల్ సీఐ వెంకటేష్ అన్నారు. సత్తుపల్లి డిపో పరిధిలో కల్లూరు బస్టాండ్ నందు వేసవిలో ప్రయాణికులకు 70 రోజులపాటు దాతల సహకారంతో అందించిన ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం ముగింపు సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. 
ప్రయాణికుల ఆరోగ్యమే ముఖ్యమని భావించి వేసవిలో 70 రోజులపాటు కల్లూరు బస్టాండ్ లో ప్రయాణికులకు ఉచిత మజ్జిగ పంపిణీ, ఓఆర్ఎస్ పాకెట్ల పంపిణీ, కూలింగ్ మినరల్ వాటర్ అందించడం చాలా గొప్ప విషయమని డిపో మేనేజర్ యు రాజలక్ష్మి సేవలు మరువలేనివి అని అన్నారు. ఏ కార్యక్రమాన్ని కల్లూరులో ఆర్టీసీ ఆధ్వర్యంలో చేపట్టిన దాతలు ముందుకు వచ్చి విజయవంతం చేయడం చాలా ఆనందకరంగా ఉందని డిపో మేనేజర్ యు రాజ్యలక్ష్మి పేర్కొన్నారు. 
దాతలు అందిస్తున్న సహకారం సత్తుపల్లి డిపో మరువలేనిది అని ఆమె పేర్కొన్నారు. మూడు నెలలపాటు కూలింగ్ మినరల్ వాటర్ అందించిన ఆళ్లకుంట నరసింహారావు ను దుస్యాలువతో ఈ సందర్భంగా సత్కరించారు. అనంతరం విలేజ్ బస్ ఆఫీసర్ కిన్నెర ఆనందరావును లైన్స్ క్లబ్ సభ్యులు ఘనంగా సన్మానించారు. 70 రోజులు పాటు నిర్విరామంగా ప్రయాణికులకు ఉచితంగా మజ్జిగ పంపిణీ చేసిన దాతల సేవలను ఈ సందర్భంగా వారు కొనియాడారు. గత మూడేళ్లుగా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కల్లూరు బస్టాండులో ప్రతి వేసవిలో ప్రయాణికుల సౌకర్యార్థం ఉచితంగా మజ్జిగ పంపిణీ, కూలింగ్ మినరల్ వాటర్, ఓ ఆర్ ఎస్ ప్యాకెట్ల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపడుతున్న సత్తుపల్లి డిపో అధికారులను, జిల్లా కాంగ్రెస్ నాయకులు పసుమర్తి. చందర్రావు, మాజీ జెడ్పిటిసి లక్కినేని రఘు లు ఈ సందర్భంగా అభినందించారు. చివరి రోజు కల్లూరు గ్రామపంచాయతీ వారు ప్రయాణికులందరికీ ఉచితంగా మజ్జిగ పంపిణీ చేయడం అభినందనీయమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ ఈవో కృష్ణారావు, పంచాయతీ అధికారి, ఎల్ డి సి శామ్యూల్, నాయకులు ఆళ్లకుంట నరసింహారావు, ధారారంగా, ఉస్మాన్, త్రినాధ్, రాము యాదవ్, రుక్మిణి, దామాల సురేష్, బైర్ల కాంతారావు, దార్ల నరసింహారావు, ఆర్ఎంపి వైద్యులు రాజు, కిషోర్, లైన్స్ క్లబ్ చలువాది. నగేష్, నాగేంద్రబాబు. తదితరులు పాల్గొన్నారు.