సిఐ రామసుబ్బయ్య ఆధ్వర్యంలో పేకాట స్థావరంపై మెరుపు దాడులు

సిఐ రామసుబ్బయ్య ఆధ్వర్యంలో పేకాట స్థావరంపై మెరుపు దాడులు

జనం న్యూస్ జనవరి 9 అనంతపురం జిల్లా గుంతకల్ ప్రతినిధి,గుంతకల్ డిఎస్పి యు నర్సింగప్ప ఆదేశాల మేరకు, ఒకటో పట్టణ సీఐ కె రామసుబ్బయ్య ఆధ్వర్యంలో, ఎస్సై మురారి బాబు, కలిసి సి ఐ వచ్చిన సమాచారం మేరకు గుంతకల్ టౌన్ ఆలూరు రోడ్ లోని రైల్వే బ్రిడ్జి దగ్గర గల కంపచెట్ల వద్ద పేకాట ఆడుతున్న, ఎనిమిది మంది ముద్దాయిలను అరెస్టు చేసి, అరెస్ట్ అయిన వారి వివరాలు, 1. కూకట్ల మధుబాబు, s/o K. నరసింహులు, గుంతకల్ టౌన్.      2.  బోయ రఘు s/o బోయ సుంకన్న, గుంతకల్. 3. చట్ట అంజని కుళ్ళాయిస్వామి  s/o ఆదినారాయణ, గుంతకల్. . జొన్నల మస్తాన్ వలి s/o ఇమాం సాబ్, గుంతకల్.  5. కమ్మ శ్రీనివాసులు s/o చేచ్చన్న, గుంతకల్.   6. పుల్లమ్మగారి లోకేష్, s/o తిప్పారెడ్డి, గుంతకల్  7. ఆత్మకూర్ హరికృష్ణ s/o వెంకటేష్, గుంతకల్.    8. సంకల శ్రీనివాసులు s/o రామయ్య, గుంతకల్.వారి వద్ద నుంచి సుమారు 36,710, నగదును, పేకముక్కులను,స్వాధీనం చేసుకోవడం జరిగిందని సీఐ కె రామసుబ్బయ్య తెలిపారు,