సిడిఎ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ

సిడిఎ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ

జనం న్యూస్) జూలై 10 కల్లూరు మండల ప్రతినిధి సురేష్ :-మండల పరిధిలోగల  చండ్రుపట్ల రోడ్డు లో టీజీఎమ్ ఆవరణం నందు సెంటర్ ఫర్ డెవలప్మెంట్ యాక్షన్ ఆధ్వర్యంలో బుధవారం 20 మంది మహిళలకు ఉచిత కుట్టు మిషన్ లను తాహాశిల్దార్ పులి సాంబశివుడు, ఏఐసిసి రాష్ట్ర అధ్యక్షులు, సిడిఏ కార్యదర్శి రెవ పి.ఎనోష్ కుమార్ పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న తహశీల్దార్ పులి సాంబశివుడు  మాట్లాడుతూ నిరుపేద మహిళలకు  ఒక గొప్ప సువర్ణ అవకాశమని అన్నారు. తమ కుటుంబ ఆర్థిక అభివృద్ధి కు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సిడిఏ సంస్థ ద్వారా ఆరు నెలలపాటు శిక్షణ పొంది  నైపుణ్యతను సంపాదించుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని తెలిపారు. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ యాక్షన్ ఆధ్వర్యంలో సుమారు రెండు లక్షల రూపాయలు విలువగల కుట్టు మిషన్లు ఇవ్వడం జరిగిందని ,ఇప్పటి వరకు మూడు బ్యాచ్ లకు శిక్షణ కార్యక్రమం పూర్తయ్యాయని తెలిపారు. బుధవారం నాలుగో బ్యాచ్ కు ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సామాజిక కార్యక్రమాలతో నిరుపేద మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడం అభినందనియమని సిడిఎ కార్యదర్శి ఎనోష్ కుమార్ ను  అభినందించారు. అనంతరం సెంటర్ ఫర్ డెవలప్మెంట్ యాక్షన్ కార్యదర్శి ఎనోష్ కుమార్ సంస్థ కార్యక్రమాలను వివరిస్తూ గత రెండు సంవత్సరాలుగా సిడిఏ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు మిషన్ ట్రైనింగ్ సెంటర్ ని నడపడం జరుగుతుందని ప్రతి ఏటా రెండు బ్యాచ్ లకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ప్రతి బ్యాచ్ కి 20 మంది నిరుపేద,మధ్యతరగతి కుటుంబ మహిళలు ఉపాధి పొందుతున్నారని తెలియజేశారు. బుధవారం నాలుగవ బ్యాచ్  శిక్షణ కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని ఈ శిక్షణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన తాహాశిల్దార్ సాంబశివుడు కు సి డి ఎ సంస్థ తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. సిడిఏ సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలు స్ఫూర్తిదాయకంగా ఆదర్శవంతంగా నిలవాలంటే శిక్షణలో మహిళలు ప్రత్యేక శ్రద్ధ వహించి నైపుణ్యవంతంగా నేర్చుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో  చంద్రలీల ఎనోష్ ,కాటేపల్లి రజనీకాంత్, మట్టూరి జనార్ధన్ ,పోట్రు కిరణ్,సేవకులు తెళ్లురి సంజీవరావు, సుందర్ రాజు, టి.సంసోన్, జి.జీవన్ కుమార్,ఆల్కహాలిక్స్ ఎనానిమస్ సభ్యులు,మహిళలు,పలువురు పాల్గొన్నారు.