స్కూల్ పిల్లల ముందే లేడీ ప్రిన్సిపాల్ ను చావకొట్టిన టీచర్లు.. అసలు ఎం జరిగింది..? (వీడియో చూడండి)

జనం న్యూస్: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పవలసిన టీచర్లే దారి తప్పితే.. ఆ విద్యార్థుల పరిస్థితి ఏంటి..? గురువుల నుంచి వాళ్లు ఏం నేర్చుకోవాలి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోను చూస్తే మీకు ఈ ప్రశ్న తలెత్తక మానదు. అవును, బిహార్‌కు చెందిన కొందరు మహిళా టీచర్లు తమ విద్యార్థుల కళ్ల ముందే తుక్కుతుక్కుగా కొట్టుకున్నారు. అలా స్కూల్ బిల్డింగ్ లోపల నుంచి పక్కనే ఉన్న పొలం గట్టు మీదకు వచ్చి మరీ కొట్టుకుంటూనే ఉన్నారు. ఒకరి జుట్టు మరొకరు పట్టుకుంటూ చెప్పులతో తన్నుకున్నారు. ఇక ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.పట్నాలోని కొరియా పంచాయత్‌ విద్యాలయ్‌ స్కూల్‌లో ఈ ఘటన జరిగింది. కిటికీ తలుపులు మూయడంపై స్కూల్ ప్రిన్సిపాల్, స్టాఫ్ టీచర్ల మధ్య వాగ్వాదం మొదలైంది. క్లాస్‌రూమ్‌లోకి వచ్చిన ప్రిన్సిపాల్ కాంతి కుమారి గది కిటికీలు మూసివేయాలని అనితా కుమారి అనే టీచర్‌కు చెప్పారు. అయితే సదరు టీచర్ నిరాకరించడంతో ఇద్దరూ వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత ప్రిన్సిపల్‌ కాంతి కుమారి క్లాస్‌రూమ్‌ నుంచి బయటకు వళ్తుండగా.. టీచర్‌ అనిత ఆమె వెనుకే చెప్పు పట్టుకుని వచ్చి దాడి చేశారు. దీంతో అనితకు సప్పోర్ట్‌గా మరో టీచర్‌ కూడా ప్రిన్సిపల్‌పై దాడికి దిగారు. అలా స్కూల్ పక్కనే ఉన్న పొలాల్లోకి వెళ్లి ఆ ముగ్గురు తన్నుకున్నారు. ఇదంతా విద్యార్థుల కళ్లముందే జరగడం గమనార్హం. కాగా, అక్కడే ఉన్న కొందరు వీరిని వారించడంతో గొడవను ఆపారు. ఇంకా దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో.. బ్లాక్‌ ఎడ్యుకేషన్‌ అధికారి నరేశ్‌ స్పందించారు. ప్రిన్సిపాల్‌తో సదరు టీచర్లకు వ్యక్తిగత విభేదాలు ఉన్నాయని, దీనిపై దర్యాప్తు చేపట్టామని, వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అలాగే దీనిపై నెటిజన్లు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటివారిని వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాలని, లేకపోతే విద్యార్థుల విలువైన భవిష్యత్ గాడి తప్పుతుందని డిమాండ్ చేస్తున్నారు.