హీరో రామ్ చరణ్ కోసం నడి రోడ్డు పై పిచ్చ కొట్టుడు కొట్టుకున్న అమ్మాయిలు.. ( వైరల్ వీడియో చూడండి )
జనం న్యూస్: తమకిష్టమైన హీరో కోసం సాధారణంగా మగవాళ్లు కొట్టుకుంటూ ఉంటారు. వేరే హీరో అభిమానితో గొడవ పడుతూ ఉంటారు. కానీ, ఇందుకు భిన్నమైన సంఘటన తెలుగు రాష్ట్రంలో చోటుచేసుకోవటం గమనార్హం. సినిమా వాళ్లను దేవుళ్లుగా కొలిచే దేశం మనది. హీరో, హీరోయిన్లు, స్టార్ డమ్ ఉన్న నటుల విగ్రహాలు పెట్టడం.. గుళ్లు కట్టించటం వంటి సంఘటనలు చాలానే జరిగాయి. తమిళనాడులో కుష్భూ, నమిత వంటి హీరోయిన్లకు అభిమానులు గుళ్లు కట్టించారు. ఇక, తెలుగు రాష్ట్రాల్లో కూడా తమ అభిమాన హీరో విగ్రహాలు పెట్టిన వాళ్లు ఉన్నారు. ముఖ్యంగా తమ అభిమాన హీరోను గుండెల్లో గుడి కట్టుకుని పూజిస్తుంటారు. ఇంత అభిమానం ఉన్న ఫ్యాన్స్ తమ హీరోను ఏమైనా అంటే అస్సలు ఊరుకోరు. సాధారణంగా ఇష్టమైన హీరో కోసం మగవాళ్లు గొడవ పడుతూ ఉంటారు. కానీ, తాజాగా, ఇందుకు భిన్నమైన సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ స్టార్ హీరో విషయమై ఓ ఇద్దరు అమ్మాయిలు గొడవపడ్డారు. పదుల సంఖ్యలో ఉన్న విద్యార్థుల ముందు దారుణంగా కొట్టుకున్నారు. ఈ సంఘటన తెలుగు రాష్ట్రంలోనే చోటుచేసుకుంది. గొడవ ఎందుకు? ఎలా మొదలైందో తెలియదు కానీ, రామ్ చరణ్ ఫ్యాన్‌కు వేరే అమ్మాయికి మధ్య గొడవ జరిగింది. గొడవ కాస్తా కొట్టుకునే స్థితికి వెళ్లింది. కాలేజ్‌లో చదువుకుంటున్న ఆ ఇద్దరు లేడీ స్టూడెంట్స్ తోటి విద్యార్థుల మధ్యే గొడవ పడ్డారు. జుట్లు పట్టుకుని మరీ కొట్టుకున్నారు. పక్కన ఉన్న కొందరు వారిని విడిపించటానికి ప్రయత్నించినా వారు వెనక్కు తగ్గలేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటన ఎక్కడ? ఎప్పుడు జరిగిందన్న దాంట్లో కూడా స్పష్టత లేదు. వీడియో కారణంగా సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ మన దేశంలో ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి’’.. ‘‘ గ్లోబల్ స్టార్ కోసం ఆ మాత్రం గొడవ పడ్డం సాధారణం’’.. ‘‘ ఆడవాళ్లు అన్ని రంగాల్లో ఉన్నతి సాధించటం అంటే ఇదే కాబోలు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.